iDreamPost

ఈమె ఆన్ మేరీ, 21 ఏళ్ల లా స్టూడెంట్, ప్రతి ఆదివారం ఫ్రీగా బ‌స్సు డ్రైవింగ్ చేస్తుంది

ఈమె ఆన్ మేరీ,  21 ఏళ్ల లా స్టూడెంట్, ప్రతి ఆదివారం ఫ్రీగా బ‌స్సు డ్రైవింగ్ చేస్తుంది

ఆన్ మేరీ, 21 సంవత్సరాల లా స్టూడెంట్. వారమంతా కాలేజీకెళ్తుంది. ఆదివారం వస్తే మాత్రం బస్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవర్ పాత్రలోకి దిగిపోతుంది. ఎందుకిలా అంటే ప్యాషన్ అంటుంది. కొచ్చికి చెందిన యాన్ మేరీ ఎర్నాకులం లా కాలేజ్ లో ఫోర్త్ ఇయర్ చదువుతుంది. తండ్రి పి.జి. అన్సలేన్ కాంట్రాక్టర్. తల్లి స్మితా జార్జ్ పాలక్కడ్ అదనపు జిల్లా జడ్జ్. చిన్నప్పటి నుంచి యాన్ మేరీకి వాహనాలు నడపడమంటే పిచ్చి. టెన్త్ లో ఉన్నప్పుడే తండ్రి బులెట్ నడిపేది. 18 ఏళ్ళు రాగానే టూ వీలర్, ఫోర్ వీలర్ లైసెన్స్ సంపాదించుకుంది. 21 సంవత్సరాలకు హెవీ వెహికిల్స్ లైసెన్స్ కూడా సాధించుకుని ప్రైవేట్ బస్ డ్రైవర్ అవతారమెత్తింది. ఆదివారాలు మాత్రమే తను బస్ నడుపుతుంది. డ్రైవర్ గా పని చేస్తున్నందుకు రూపాయి తీసుకోదు. ఎప్పుడూ బిజీగా ఉండే కక్కనాడ్- పెరుంపదప్పు రూట్ లో ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఏడు వరకు యాన్ మేరీ డ్రైవర్ డ్యూటీ.

ఒక అమ్మాయి బస్ నడపడం చూసి మొదట్లో అందరూ ఆశ్చర్యపోయేవారు. ప్యాసింజర్లయితే యాక్సిడెంట్ ఖాయమని వణికిపోయేవారు. తోటి డ్రైవర్లు ఆమెను ఎగతాళి చేస్తూ ఓవర్ టేక్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కొందరైతే అభ్యంతరకరమైన కామెంట్లు పాస్ చేసేవారు. కానీ యాన్ మేరీ వీటన్నింటిని తట్టుకుని గట్టిగా నిలబడింది. ఇప్పుడా రూట్ లో అందరూ ఆమెను గుర్తుపడతారు. బస్ కండక్టర్, ప్యాసింజర్లు కూడా తననిప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు. ఈ క్రెడిటంతా తన పక్కింట్లో ఉండే శరత్ దే అంటుంది యాన్ మేరీ. ప్రైవేట్ బస్ ఆయనదే! తనకి చిన్నప్పటి నుంచి బస్సు నడపడం నేర్పింది కూడా ఆయనే!
22 ఏళ్ళు వచ్చేలోపు జేసీబీ, కంటెయినర్లు నడపడం నేర్చుకుంటానంటోందీ చిచ్చర పిడుగు. బండ్లు నడపడంలోనే కాదు చదువులోనూ యాన్ మేరీ టాప్. అంతే కాదు తను మంచి పవర్ లిఫ్టర్, కీబోర్డు ప్లేయర్ కూడా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి