iDreamPost

హైదరాబాద్ లో భారీ శబ్ధంతో పేలుడు.. ఉలిక్కిపడిన ప్రజలు!

Massive Explosion in Hyderabad: ఇటీవల దేశంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా బెంగుళూరులోని రామేశ్వ‌రం కేఫ్‌ ఘటన తర్వాత ప్రజల్లో మరింత భయం నెలకొంది.

Massive Explosion in Hyderabad: ఇటీవల దేశంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా బెంగుళూరులోని రామేశ్వ‌రం కేఫ్‌ ఘటన తర్వాత ప్రజల్లో మరింత భయం నెలకొంది.

హైదరాబాద్ లో భారీ శబ్ధంతో పేలుడు.. ఉలిక్కిపడిన ప్రజలు!

ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు సంభవించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఉగ్ర కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నింధితుడిని  అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఎక్కడైనా పేలుడు శబ్ధం వినిపిస్తే ప్రజలు ఒక్కసారే ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల తరుచూ హూటల్, రెస్టారెంట్స్, ఇండ్లల్లో గ్యాస్ సిలిండర్ అనుకోకుండా పేలుతున్న ఘటనలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు బాణా సంచ పరిశ్రమల్లో పేలుడు ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలో పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ వనస్థలీపురం రైతు బజార్ సమీపంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ శబ్ధానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైతు బజార్ సమీపంలోని పెట్రోల్ బంక్ ముందు టిఫిన్, స్నాక్స్ షాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆ షాప్ లో హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది.. ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. షాప్ నిర్వాహకుడు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పి వేశారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో భయంతో జనాలు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ఎలా జరిగింది అన్న విషయాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

వేసవి కాలంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్లు లీక్ కావడం, పేలిపోవడం జరుగుతుందని.. వీటి విషయంలో ఎప్పటిప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లు సాధ్యమైనంత వరకు ఓపెన్ ప్లేస్ లో ఉంచితే ప్రమాదాలు చాలా వరకు నివారించవొచ్చని అంటున్నారు. గతంలో గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వనస్థలీపురం రైతు బజార్ సమీపంలో జరిగిన సిలిండర్ ప్రమాదం నగరంలో చర్చనీయాంశం అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి