iDreamPost

March 4th Releases : మార్చి 4 – ఆసక్తి రేపే బాక్సాఫీస్ వార్

March 4th Releases : మార్చి 4 – ఆసక్తి రేపే బాక్సాఫీస్ వార్

ఇంకో వారం దాకా భీమ్లా నాయక్ సందడే ఉండబోతోంది కానీ రాబోయే శుక్రవారం నుంచి మళ్ళీ కొత్త సినిమా సందడి షురూ కానుంది. అందులో మొదటిది ఆడవాళ్ళూ మీకు జోహార్లు. వాస్తవానికి దీని రిలీజ్ ముందు ఫిబ్రవరి 25 ఫిక్స్ చేసుకున్నప్పటికీ అనూహ్యంగా పవన్ మూవీ వచ్చేయడంతో తప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. అందుకే మార్చ్ 4 కి ఫిక్స్ అయ్యారు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో రష్మిక మందన్న హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మెల్లగా పాపులర్ అవుతోంది. సీనియర్ లేడీ ఆర్టిస్టులు చాలానే ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసిన ఈ చిత్రం మీద మంచి అంచనాలే ఉన్నాయి.

ఖచ్చితంగా హిట్ కొట్టే తీరాల్సిన పరిస్థితిలో శర్వానంద్ ఈ ఆడవాళ్ళూ మీకు జోహార్లుతో వస్తున్నాడు. వరస డిజాస్టర్ల తర్వాత తన మార్కెట్ బాగా దెబ్బ తింది. అప్పుడెప్పుడో పడి పడి లేచే మనసుతో మొదలుపెడితే మొన్నటి మహాసముద్రం దాకా అన్నీ ఒకటే ఫలితం. డిజాస్టర్ కు ఏదీ తగ్గలేదు. సో ఇది కనక సక్సెస్ అయితే రాబోయే ఒకే ఒక జీవితంకు మంచి బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికైతే ప్రోమోలు గట్రా ఆకట్టుకునేలాగే ఉన్నాయి. మరి సినిమా కూడా అదే విధంగా ఉంటే సేఫ్ అవుతాడు. ఎస్ఆర్ కళ్యాణమండపంతో ఊహించని విజయం దక్కించుకున్న కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ కూడా అదే రోజు శర్వాతో క్లాష్ కు సిద్ధపడింది.

రేచీకటితో బాధపడే కానిస్టేబుల్ గా కిరణ్ ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ పోషించాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ కాప్ థ్రిల్లర్ మీద యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ రెండు సినిమాలు వేర్వేరు జానర్లు కావడం వల్ల ఇబ్బందేమీ లేదు కానీ ఎటొచ్చి ఒక చిక్కయితే ఉంది. మార్చి 11 రాధే శ్యామ్ రాబోతోంది. అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు భీమ్లా వెనక రాధే శ్యామ్ ఇలా రెండువైపులా రిస్కులు పెట్టుకుని మరీ శర్వా, కిరణ్ లు దిగుతున్నారు. వీళ్ళు చాలదన్నట్టు మార్చి 4న హాలీవుడ్ మూవీ ది బ్యాట్ మ్యాన్ కూడా వస్తోంది. చూడాలి మరి ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయా

Also Read : Pawan Kalyan : నాన్ స్టాప్ బ్యాటింగ్ చేసిన పవర్ స్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి