iDreamPost

రసవత్తరంగా మారిన చెన్నూరు రాజకీయం.. గెలుపు ఎవరిది?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి.

రసవత్తరంగా మారిన చెన్నూరు రాజకీయం.. గెలుపు ఎవరిది?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ తర్వాత నామినేషన్ల సందడి మొదలవుతుంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారారు చేసి.. బీ-ఫారాలు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా, బీజేపీ మాత్రం 53 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు నియోజకవర్గాల వారిగా ప్రచారాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించగా, బీజేపీ మాజీ ఎంపీ గడ్డం వివేకానంద పేరు ఖారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో క్లారిటీ రాలేదు. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ నియెజకవర్గాలు ఉన్నాయి. వీటిలో చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కాగా, మంచిర్యాల మాత్రం జనరల్ కేటగిరి కేటాయించడం జరిగింది.

ఇప్పటి వరకు మంచిర్యాల, బెల్లంపల్లితో పోల్చుకుంటే చెన్నూరు లో రాజకీయం భలే రసవత్తరంగా మారింది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేబీ నేత వివేకానంద సైతం గ్రామాల్లో తిరుగుతూ తనదైన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం ఎవరికి సీటు కేటాయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చెన్నూరు లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొంది.

ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అధికార పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో చెన్నూరు టికెట్ ఆయన కూడా ఆశిస్తున్నారు. మరోవైను నూకల రమేష్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ కొంత కాలంగా ఢిల్లీలో మకాం వేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీ లో పెద్దలు గెలుపు గుర్రాలకు టికెట్ కేటాయించాలని చూస్తున్నారు. ఒక్కసారి తమ పేర్లు కన్ఫామ్ అయితే తమ సత్తా ఏంటో చూపిస్తామని.. గెలుపు పై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతుందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి