iDreamPost

భారత్ అబ్బాయి, లండన్ అమ్మాయి.. ఎల్లలు దాటిన ప్రేమకథ!

Indian Man Narried Landon Girl: ప్రేమకు కులాలు, మతాలే కాదు.. రాష్ట్రాలు, దేశాలు కూడా హద్దు లేవు అని నిరుపిస్తున్నారు ఎన్నో జంటలు. దేశాలు దాటి ఖండాంతరాల్లో ఉన్న తమ ప్రియురాలిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు నేటి యువతీ యువకులు.

Indian Man Narried Landon Girl: ప్రేమకు కులాలు, మతాలే కాదు.. రాష్ట్రాలు, దేశాలు కూడా హద్దు లేవు అని నిరుపిస్తున్నారు ఎన్నో జంటలు. దేశాలు దాటి ఖండాంతరాల్లో ఉన్న తమ ప్రియురాలిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు నేటి యువతీ యువకులు.

భారత్ అబ్బాయి, లండన్ అమ్మాయి.. ఎల్లలు దాటిన ప్రేమకథ!

ప్రేమకు ఎలాంటి హద్దులు, సరిహద్దులు లేవని నిరూపిస్తున్నారు యువత. నగరాలు, రాష్ట్రాలే కాదు ఖండంతారాలు దాటి మరీ ప్రేమించిన అమ్మాయిని మనువాడుతున్నారు. మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం, వ్యాపారం చేయడానికి ఎంతోమంది యువత విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ తమ సహ ఉద్యోగుల ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే చాలా వరకు భారతీయ  సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది యువకులు విదేశీ యువతులను ప్రేమించి తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ యువకుడు లండన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లా పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు.. లండన్ కి చెందిన డయానాని తెలంగాణ సంప్రదాయ పద్దతుల్లో పెళ్లి చేసుకున్నాడు.  బెల్లంపల్లి పట్టణంలో ఓ కళ్యాణ మండపంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్లి చూసేందుకు బెల్లంపల్లివాసులు కళ్యాణ మండపానికి తరలి వచ్చారు.  రాజు గత మూడేళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం లండన్ కి వెళ్లాడు. అక్కడే డయానాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి కొంతకాలం కలిసి ఉన్నారు. తన ప్రేమ విషయాన్ని రాజు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఓకే చెప్పారు.

మొదటి నుంచి డయానాకు  భారత సంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ కట్టు, బట్టు అంటే చాలా ఇష్టపడేది. ఈ కారణంతోనే ఆమె తమ పెళ్లి భారతీయ సంప్రదాయల ప్రకారం జరగాని తన ప్రేమికుడు రాజు తో చెప్పింది.  ఆమె కోరిక మేరకు స్థానిక ఆచార వ్యవహారాల ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. అయితే పలు కారణాల వల్ల డయానా తల్లిదండ్రులు పెళ్లికి హాజరు కాలేక పోయారు. అయితే వారి తరుపు నుంచి బెల్లింపల్లికి చెందిన ముత్తె వెంకటేష్, లావణ్య దంపతులు కన్యాదానం చేశారు. వివాహానికి హాజరైన వారంతా నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి ఫోటో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి