iDreamPost
android-app
ios-app

వీడియో: వీడు మామూలోడు కాదు.. ఒకేసారి నలుగురు యువతులతో..

  • Published Dec 08, 2023 | 3:05 PM Updated Updated Dec 08, 2023 | 3:05 PM

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. ఈ మధ్య పెళ్లిళ్ళు చాలా చిత్ర విచిత్రమైన పద్దతుల్లో జరుగుతున్నాయి.. వీటికి సంబంధించిన వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. ఈ మధ్య పెళ్లిళ్ళు చాలా చిత్ర విచిత్రమైన పద్దతుల్లో జరుగుతున్నాయి.. వీటికి సంబంధించిన వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

వీడియో: వీడు మామూలోడు కాదు.. ఒకేసారి నలుగురు యువతులతో..

పెళ్లంటే నూరేళ్ల పంట.. పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు కొత్త జంట. వివాహం అనేది  వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయలను బట్టి జరుపుకుంటారు. కానీ ఈ మద్య పెళ్లిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. కాస్త ఖర్చు ఎక్కువైనా.. తమ ఆలోచనలకు అనుగుణంగా జరుపుకుంటున్నారు. ఆకాశం, సముద్ర గర్బం ఇలా రక రకాల ప్రదేశాల్లో పెళ్లిళ్ళు జరుపుకుంటున్నారు. ఈ మద్య ఓ జంట ఏకంగా కదులుతున్న జనరల్ ట్రైన్ లోనే  పెళ్లి చేసుకున్నారు. మరికొన్ని చోట్ల పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు పెళ్లి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొన్ని వివాహవేడుకల్లో ఫన్నీ ఘటనలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొత్త జంట చేసే ఫన్నీ మూవ్ మెంట్స్, పెళ్లికి విచ్చేసిన అతిథులు చేసే హంగామా, డ్యాన్స్ లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో పలు చోట్ల ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కాకపోతే అవన్నీ పరస్పర అంగీకారంతో జరిగినవే. తాజాగా అలాంటి ఓ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ పెళ్లి కొడుకు ఒక్కడు.. వధువులు మాత్రం నలుగురు. వింటానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఒకే పెళ్లిమండపంలో నలుగురు యువతులను పెళ్లి చేసుకున్నాడు యువకుడు.

men marry to 4 womens in single time

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి కొడుకు నలుగురు పెళ్లి కూతుళ్లతో కల్యాణ మండపంలో అగ్ని హూత్రం చుట్టూ తిరుగుతున్న దృశ్యం కనిపించింది. వరుడు ముందు నడుచుకుంటూ వెళ్తుంటే.. నలుగురు వధువులు అతని వెంట ఏడడుగులు వేశారు. చుట్టు బంధువులు సందడి కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. వీడు మామూలోడు కాదు.. ఏకంగా నలుగురిని ఏలబోతున్నాడు అని అంటే.. ఇది నమ్మశక్యం కాని విషయం, అసలు ఇది నిజమా..? ఫ్రాంక్ చేస్తున్నారా? అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పెళ్లి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.