iDreamPost

మ్యాట్రిమోనీలో గాలమేసి.. యువతిని హోటల్‌లో కలిసి.. రూ.70 లక్షలు కొట్టేశాడు!

Man Cheating Women: ఈజీ మనీ కోసం ఈ మధ్య చాలా మంది ఎన్నో మోసాలకు పాల్పపడుతున్నారు. పెళ్లి కొడుకు అవతారమెత్తి అమ్మాయిలకు వల వేసి అందినంత దోచుకుంటున్నారు.

Man Cheating Women: ఈజీ మనీ కోసం ఈ మధ్య చాలా మంది ఎన్నో మోసాలకు పాల్పపడుతున్నారు. పెళ్లి కొడుకు అవతారమెత్తి అమ్మాయిలకు వల వేసి అందినంత దోచుకుంటున్నారు.

మ్యాట్రిమోనీలో గాలమేసి.. యువతిని హోటల్‌లో కలిసి.. రూ.70 లక్షలు కొట్టేశాడు!

ఈ మద్య కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అనేక అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. అందుకోసం ఎదుటి వారిని నమ్మించి దారుణంగా మోసం చేస్తున్నారు. లగ్జరీ జీవితాలకు అలవాటు పడిన వారు.. బెట్టింగ్ లో డబ్బు పోగొట్టుకున్నవారు ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. మ్యాట్రిమోనీ లో పలువురు యువతులకు గాలం వేసి మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని పోలీసులు గాలం వేపట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.

పెళ్లి పేరుతో ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమె నుంచి రూ.70 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణ జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేష్ (40) ఆన్ లైన్ ట్రెండింగ్ చేసేవాడు. ఇటీవల ట్రేడింగ్ లో భారీగా నష్టపోయాడు. ఈ క్రమంలోనే ఈజీ గా డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మ్యాట్రిమోని సైట్ ద్వారా యువతులను మోసగించాలని పక్కా ప్లాన్ వేశాడు. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో పెళ్లి సంబంధాల కోసం సంప్రదించేవాడు. ఎవరైనా అతన్ని సంప్రదిస్తే.. వారితో స్నేహం చేస్తూ మాయమాటలు చెప్పి డబ్బులు గుంజడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్ లో తెలుగు మ్యాట్రిమోని యాప్ లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ తో ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరం పెళ్లి చేసుకొని మంచి జీవితం గడపాలని మాయమాటలు చెప్పాడు. ఆ మహిళ అతని మాయమాలకు పడిపోయింది. ఒకసారి వ్యక్తిగతంగా కలవాలని కోరింది.. అదే సమయంలో తన తల్లిదండ్రులు, తమ్ముడు కృష్ణా జిల్లాలో ఉన్నారని ఆర్థిక సమస్యల ఉన్నాయని చెప్పాడు. అతని మాటలు నమ్మి ఏప్రిల్ లో 30న రూ.2 లక్షలు ఇచ్చింది. ఇద్దరూ ప్రకాశ్ నగర్ లో ఓ హూటల్ కలిశారు. అలా మాయ మాటలు చెబుతూ ఇంటిపై రుణం, బంగారం తాకట్టు పెట్టి దాదాపు రూ.70 లక్షల వరకు అతని చేతిలో పెట్టింది. తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తే పట్టించుకోవడం మానేశాడు. దీంతో బాధితురాలు తాను మోసోయాని అర్థం చేసుకొని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడు రాజేశ్ ను అరెస్ట్ చేసి అతని నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి