iDreamPost

మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎవరికైనా ఇస్తున్నారా? జాగ్రత్త.. ఇలా మోసపోతారు!

విశాఖలో సరికొత్త మోసం ఆలస్యంగా బయటపడింది. ఆధార్ కార్డు జిరాక్స్ తో ఓ యజమానినే బురిడీ కొట్టించాడు. ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో పెద్ద ప్లాన్ వేసి భారీ మోసం చేశాడు.

విశాఖలో సరికొత్త మోసం ఆలస్యంగా బయటపడింది. ఆధార్ కార్డు జిరాక్స్ తో ఓ యజమానినే బురిడీ కొట్టించాడు. ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో పెద్ద ప్లాన్ వేసి భారీ మోసం చేశాడు.

మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎవరికైనా ఇస్తున్నారా?  జాగ్రత్త.. ఇలా మోసపోతారు!

నేటికాలంలో ఈజీగా డబ్బు సంపాదించాలనే కేటుగాళ్ల సంఖ్య ఎక్కువపోయింది. అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి భారీగా డబ్బు దోచుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. వివిధ పనుల నిమిత్తం మనం సమర్పించే ఆధార్ కార్టు వంటి వాటి జిరాక్సులతో బురిడీ కొట్టిస్తున్నారు. మీరు కూడా మీ ఆధార్ కార్డు జిరాక్స్ ను ఎవరికైనా ఇస్తున్నారా?. అయితే కాస్తా జాగ్రత్త.. లేకుంటే భారీ మోసానికి గురవుతారు. తాజాగా విశాఖపట్నంలో ఓ మోసం బయటపడింది. ఓ కేటుగాడు గ్యాస్ కనెక్షన్ కోసం ఇంటి యాజమాని ఆధార్ కార్డు తీసుకొని.. ఆ నంబరు ఆధారంగా బ్యాంకులో అకౌంట్ తెరిచి లావాదేవీలు సాగించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

విశాఖపట్నం జిల్లాలోని కంచరపాలెంలో నివాసం ఉంటున్న సత్తి పద్మావతి తన ఇంటిని గొంప నాయుడు అనే వ్యక్తికి కొంతకాలం అద్దెకు ఇచ్చారు. అతడు  2020 ఇళ్లు ఖాలీ చేశాడు. ఇంటిని వదిలి వెళ్లే సమయంలో గ్యాస్‌ కనెక్షన్‌ మార్చేందుకు ఇంటి యజమాని ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీని తీసుకున్నాడు. ఆ  ఆధార్ నెంబర్ తో గాజువాకలోని ఓ బ్యాంకులో ఖాతాను తెరిచాడు. అంతేకాక ఆ అకౌంట్ ద్వారా లావాదేవీలు కూడా చేస్తున్నాడు.

ఈ క్రమంలో పద్మావతికి ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా వచ్చే డబ్బులతో పాటు, మరికొన్ని రాయితీల అకౌంట్‌లో జమ కావడం లేదు. దీంతో ఆమెకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు సైతం ఈ విషయంపై ఆరా తీశారు. స్థానిక సచివాలయంకి వెళ్లి విచారణ చేస్తే ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. పద్మావతి ఆధార్ నంబరుతో గాజువాకలోని ఓ బ్యాంకు అకౌంట్‌లో నగదు జమ అవుతున్నాయని గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. చాలా సమయం పాటు గాజువాకలో తన ఆధార్ తో ఎలా అకౌంట్ ఓపెన్ అయిందో అర్థంకాక తలపట్టుకుంది.

చివరకు నాయుడు అనే వ్యక్తి ఆమె ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది.  వెంటనే కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి.. ఇలా మీరు ఎక్కడైన ఆధార్ కార్డు జిరాక్స్ లు ఇస్తున్నారా?. జిరాక్స్ లు ఇచ్చే సమయంలో కాస్తా జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీరు కూడా పద్మవతి మాదిరిగానే మోసపోయే అవకాశం ఉంది. మరి.. ఇలా ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్ల ఏలాంటి శిక్షలు విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి