iDreamPost

2022 Mahindra Scorpio Classic మహింద్రా కొత్త స్కార్పియో క్లాసిక్ వ‌చ్చేసింది, వేరియంట్లు, ఫీచర్లు, అంచనా ధర ఎంతంటే!

2022 Mahindra Scorpio Classic   మహింద్రా కొత్త స్కార్పియో క్లాసిక్ వ‌చ్చేసింది, వేరియంట్లు, ఫీచర్లు, అంచనా ధర ఎంతంటే!

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రెండు వేరియంట్స్ లో వ‌స్తోంది. ఒక‌టి క్లాసిక్ S , రెండోది క్లాసిక్ S11. రెండు 7, 9-సీట్లల‌తో వ‌స్తాయి. కొత్త స్కార్పియో క్లాసిక్ కొత్త గ్రిల్ డిజైన్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ తోపాటు మహీంద్రా కొత్త ‘ట్విన్ పీక్స్’ లోగోతో వస్తుంది. క్లాసిక్ S11కి 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వ‌స్తాయి. క్లాసిక్ Sకి మాత్రం స్టీల్ వీల్స్‌. ఇక ఇంజిన్ 2.2-లీటర్ mHawk Gen II చాలా ప‌వ‌ర్ ఫుల్, 55kg తేలికైనది. ఇంకా 14 శాతం ఇంధన సామర్థ్యాన్ని మెరుగుప‌డుంది కాబట్టి, హైవేల మీద మైలేజ్ పెర‌గ‌నుంది. త‌క్కువ సౌండ్ చేస్తుంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్ర‌మే ఉంది. ఇందులో కేబుల్ షిఫ్ట్ సెటప్ ఉంటుంది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 4,456mm పొడవు, 1,820mm వెడల్పు , 1,995mm పొడవు. వీల్‌బేస్ 2,680mm పొడవు ఉంది కాబ‌ట్టి స్టేబుల్ గా జ‌ర్నీ చేయొచ్చు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కొత్త 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వ‌చ్చింది. ఇది ఆండ్రాయిడ్. స్క్రీన్ మిర్రరింగ్ అవ‌కాశ‌మిస్తోంది.

SUV మూడు సీటింగ్ లేఅవుట్ తో, 7-సీట్లు , 9-సీటర్ ల‌తో క్లాసిక్ వ‌స్తోంది. కొత్త స్కార్పియో క్లాసిక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, పానిక్ బ్రేక్ ఇండికేషన్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, యాంటీ థెఫ్ట్ వార్నింగ్, సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్, స్పీడ్ అలర్ట్ మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆటో డోర్ లాక్ లాంటి రెగ్యుల‌ర్ ఫీచ‌ర్లు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ గ్రిల్ అదిరిపోయింది. హెడ్‌ల్యాంప్‌లు రిఫ్రెష్ అయ్యాయి. బంపర్ కొత్త ఫాగ్ ల్యాంప్‌తో కొత్త‌గా క‌నిపిస్తోంది. స్కార్పియో ముందు ఇండిపెండెంట్ ఫ్రంట్ కాయిల్ స్ప్రింగ్, వెనుక భాగంలో యాంటీ-రోల్ బార్‌తో మల్టీ-లింక్ కాయిల్ స్ప్రింగ్ తో స‌స్పెన్ష‌న్ ఉంది. ఆఫ్ రోడ్ జ‌ర్నీలో పెద్ద‌గా కుదుపులు రావు.

ఎనిమిది లక్షల మంది కస్టమర్‌లతో, స్కార్పియోకు సాటిలేని అభిమానుల ఫాలోయింగ్ ఉంది. సాయుధ దళాలు, పారా-మిలటరీ, అంతర్గత భద్రతా దళాలు స్కార్పియోను వాడ‌తున్నారు.

స్కార్పియో క్లాసిక్ రేటు ఎంతో మ‌హేంద్ర ఇంకా వెల్ల‌డించ‌లేదు. స్కార్పియో ఎన్ ప్రారంభ ధ‌ర 11.99ల‌క్ష‌లు. అందువ‌ల్ల క్లాసిక్ రేటు ప‌ది ల‌క్ష‌ల నుంచి ప్రారంభం కావ‌చ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి