iDreamPost

రాజమౌళి మూవీకి మహేశ్ ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు!

Mahesh Babu- Rajamouli Movie: మహేశ్- రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అంటూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu- Rajamouli Movie: మహేశ్- రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అంటూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి మూవీకి మహేశ్ ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ఎవరికీ స్పెషల్ ఇంట్రడక్షన్లు అవసరం లేదు. ఇప్పటి వరకు రీజనల్ హీరోగా ఉండిపోయిన ఈ స్టార్.. ఏకంగా ఒకేసారి పాన్ వరల్డ్ హీరో కాబోతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి సినిమాతో మహేశ్ ఈ అరుదైన ఘనత సాధించబోతున్నాడు. వీళ్ల కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బడ్జెటే రూ.1000 కోట్లు అని వస్తున్న వార్తలు ఫ్యాన్స్ లో అంచనాలను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. రాజమౌళితో తీయబోతున్న చిత్రానికి మహేశ్ కి అసలు రెమ్యూనరేషన్ లేదంట.

మహేశ్ బాబు సినిమా అంటే మినమం గ్యారెంటీ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే జక్కన్న సినిమా అంటే మినమం రికార్డులు బద్దలు అవుతాయి. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటేనే ఆ ఫీలింగ్ హై ఉంటుంది. అలాంటిది రూ.1000 కోట్ల బడ్జెట్, ఇండియానా జోన్స్ తరహా కథ, అమెజాన్ అడవుల్లో సినిమా షూటింగ్ అంటూ రోజుకొక వార్త బయటకు వస్తుంటే మహేశ్ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ గాసిప్ అయితే చక్కర్లు కొడుతోంది. అది వింటే ఫ్యాన్స్ మరింత ఖుషీ అయిపోతారు. అసలు విషయం ఏంటంటే.. రాజమౌళితో సినిమాకి మహేశ్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదంట. ఒక్క రూపాయి కూడా పారితోషకం అందుకోవడం లేదని తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్, ఆర్థిక లావాదేవీలు అన్నీ రాజమౌళీనే స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. జక్కన్నే ఈ సినిమాకి మహేశ్ ని రెమ్యూనరేషన్ కాకుండా పార్టనర్ ని చేసే ఆలోయచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గట్టిగానే టాక్ నడుస్తోంది. అలాగే మహేశ్ బాబు కూడా రాజమౌళితో మూవీకి ఒక్క రూపాయి కూడా రెమ్యూన్ రేషన్ తీసుకోను అన్నాడట. తన రెమ్యూనరేషన్.. సినిమా బడ్జెట్ కి భారం కాకూడని ఆ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు. సినిమా పూర్తయ్యే వరకు తనకు ఎలాంటి పారితోషకం ఇవ్వద్దు అని చెప్పాడట. అందుకే ఇప్పుడు కొత్తగా మహేశ్ బాబు కూడా రాజమౌళి సినిమాకి నిర్మాతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేశ్ నేరుగా పార్టనర్ అయ్యేందుకు ఓకే చెప్పాడా? సినిమా రిలీజ్ తర్వాత రెమ్యూన రేషన్ తీసుకుంటారా? మహేశ్ ని రాజమౌళి పార్టనర్ షిప్ కే ఓకే చేయిస్తారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సింది. ఇంక సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. మహేశ్ డేట్స్ ను జక్కన్న కనీసం ఏడాది నుంచి రెండేళ్లు బ్లాక్ చేయాలి అని భావిస్తున్నాడట. మరోవైపు మహేశ్ బాబు మాత్రం ఈ సినిమా కోసం ఎంత లేదన్నా మూడేళ్లు డేట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. ఎందుకంటే ఈ సినిమాకి తన బెస్ట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడట. అలాగే ఈ మూవీ అటు మహేశ్ కి ఇటు రాజమౌళి కెరీర్ కే బెస్ట్ ఫిల్మ్ కావాలని మహేశ్ కోరుకుంటున్నాడంటూ చెబుతున్నారు. రాజమౌళి సినిమాకి మహేశ్ ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి