iDreamPost

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ప్లానింగ్ అదుర్స్.. ఫినాలే ఎపిసోడ్ కు ఊహించని గెస్ట్!

బిగ్ బాస్ ట్రోఫీని విన్నర్ కు అందించడానికి ఓ ఊహించని గెస్ట్ ను బిగ్ బాస్ తీసుకురానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆ గెస్ట్ ఎవరు? ఆ వివరాలు..

బిగ్ బాస్ ట్రోఫీని విన్నర్ కు అందించడానికి ఓ ఊహించని గెస్ట్ ను బిగ్ బాస్ తీసుకురానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆ గెస్ట్ ఎవరు? ఆ వివరాలు..

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ప్లానింగ్ అదుర్స్.. ఫినాలే ఎపిసోడ్ కు ఊహించని గెస్ట్!

బిగ్ బాస్ సీజన్ 7.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో. ఇక ఈ షో ముందు నుంచి చెప్పినట్లుగా ఉల్టా ఫుల్టాగా సాగుతూ.. అభిమానులను అలరిస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లో ఈ షో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే కోసం ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ 17వ తారీఖున గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను నిర్వహించాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. కాగా.. ఈసారి బిగ్ బాస్ ఫైనల్ కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నాడట. అందులో భాగంగానే బిగ్ బాస్ ట్రోఫీని ఫైనల్ విన్నర్ కు అందించడానికి ఓ ఊహించని గెస్ట్ ను తీసుకురానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆ స్టార్ హీరో ఎవరు? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. ఇక ఫినాలే ఎపిసోడ్ కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. గత సీజన్ కంటే భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బాస్.. అదే రేంజ్ లో విజయం సాధించాడు. కాగా ప్రేక్షకులను మరింతగా సర్ఫ్రైజ్ చేయడానికి గ్రాండ్ ఫినాలే ను అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. డిసెంబర్ 17న ఫినాలే ఎపిసోడ్ నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఫైనల్ ఎపిసోడ్ కు పలువురు సెలబ్రిటీలతో పాటు, మెుత్తం 19 మంది కంటెస్టెంట్లు స్టేజ్ పైకి రాబోతున్నారు. బిగ్ బాస్ విన్నర్ కు ట్రోఫీని అందించడానికి ప్రతీసారి ప్రత్యేక అతిథులను తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ఈసారి కూడా ఎవ్వరూ ఊహించని గెస్ట్ ను తీసుకురాబోతున్నాడట బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబును తీసుకురాబోతున్నారన్న న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కింగ్ నాగార్జున, బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కోసం అదిరిపోయే స్కెచ్ వేశారని అభిమానులు చెప్పుకుంటున్నారు. అదీకాక సంక్రాంతి కానుకగా మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ జనవరి 12న విడుదల కాబోతోంది. పనిలో పనిగా మూవీ ప్రమోషన్ కూడా అవుతుందని, అందుకోసమే మహేశ్ ను తీసుకొద్దామని బిగ్ బాస్ భావించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి