iDreamPost

ఛీ మీరసలు మనుషులేనా.. తల్లిని కొట్టి చంపుతుంటే.. చూస్తూ నిల్చున్న కొడుకు

  • Published Apr 16, 2024 | 8:33 AMUpdated Apr 16, 2024 | 8:33 AM

తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి చంపుతుంటే ఓ కొడుకు చూస్తూ నిల్చుండిపోయాడు. వారిని అడ్డుకోలేదు సరికదా.. మద్దతిచ్చాడు. ఆ వివరాలు..

తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి చంపుతుంటే ఓ కొడుకు చూస్తూ నిల్చుండిపోయాడు. వారిని అడ్డుకోలేదు సరికదా.. మద్దతిచ్చాడు. ఆ వివరాలు..

  • Published Apr 16, 2024 | 8:33 AMUpdated Apr 16, 2024 | 8:33 AM
ఛీ మీరసలు మనుషులేనా.. తల్లిని కొట్టి చంపుతుంటే.. చూస్తూ నిల్చున్న కొడుకు

ఈ సృష్టిలో ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించగలిగేది ఒక్క తల్లి మాత్రమే. భర్త తోడు ఉన్నా లేకపోయినా.. తల్లి మాత్రం బిడ్డల బాధ్యతను మరవదు. కన్నతల్లి చూపించే మమకారం ముందు ఏ ప్రేమైనా దిగదుడుపే. బిడ్డలను కంటికి రెప్పలా కాచుకునే తల్లిని.. పిల్లలు కూడా అంతే ప్రేమించి.. బాధ్యతగా చూసుకుంటారా అంటే దానికి మాత్రం గ్యారెంటీ లేదు. అప్పటి వరకు తల్లి కొంగు పట్టుకుని తిరిగిన కొడుకులు.. భార్య రాగానే అమ్మను దూరం పెడతారు. తాను పస్తులుండి తమను పెంచిన తల్లికి పట్టెడన్నం పెట్టడానికి చేతులు రావు. వృద్ధులు అనే జాలి, దయ లేకుండా వారిపై దాడి చేస్తారు. ఇక తాజాగా ఇలాంటి దారుణమే వెలుగు చూసింది. కన్నతల్లిని కొట్టి చంపుతుంటే.. కొడుకు చూస్తూ నిల్చున్నాడు తప్ప అడ్డగించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని.. కట్టుకున్న భార్య, వదినలు కొట్టి చంపుతుంటే కొడుకు చూస్తూ నిలబడిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కోడళ్లు అత్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ సమయంలో ఆమె కొడుకు అక్కడే ఉండి చూస్తూ నిల్చున్నాడు తప్ప వారిని వారించే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని గ్వాలియర్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూడగా.. బాధితురాలిని మున్నీ దేవీ(55)గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన మున్నీదేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

మున్నీ దేవిపై కోడళ్లు దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు దీనిపై స్పందించారు. మున్నీదేవీ పెద్ద కోడలు సావిత్ర, చిన్న కోడలు చందా, పెద్ద కుమారుడు ధర్మేంద్రతో పాటు చిన్న కోడలు తండ్రి, ఇద్దరు సోదరులపై కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన గత నెల అనగా.. మార్చి 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్యాలియర్ జిల్లాలోని అంత్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రిపుర గ్రామంలో మున్నీదేవీ అనే వృద్ధురాలిపై కోడళ్లు ఇద్దరు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న కొడుకు ఈ దాడిని అడ్డుకోకపోగా, వారిని సమర్థించడం వీడియోలో కనిపించింది. అయితే అత్తా కోడళ్ల మధ్య చోటు చేసుకున్న వివాదాలే దాడికి కారణం అంటున్నారు.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రెండేళ్ల క్రితం మున్నీ దేవిపై ఆమె పెద్ద కోడలు సావిత్రి దాడి చేయడంతో ఆమె తలకు ఆరు కుట్లు పడ్డాయి. అప్పటి నుంచి అత్తాకోడళ్లు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మున్నీ దేవి చిన్న కొడుక్కి దాతియా నివాసి చందా కుమారితో వివాహం జరిగింది. పెద్ద కోడలు, చిన్న కోడలు బాగా కలిసిపోవడం మున్నీదేవికి నచ్చలేదు. దీంతో చందాకుమారిని వేధించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై చందా తన తండ్రి అమర్ సింగ్, సోదరులు అజయ్, విజయ్ సమక్షంలో పంచాయతీ పెట్టింది.

అయినా సరే అత్త మున్నీదేవి మారకపోవడంతో.. పెద్ద కోడలు సావిత్రి ఆమెపై దాడి ప్రారంభించింది. తర్వాత చిన్న కోడలు కూడా దాడిలో పాలు పంచుకుంది. కొడుకు ఉన్న కూడా దాడిని ఆపకుండా, తన భార్యను సపోర్టు చేశాడు. మున్నీదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో గ్వాలియన్ లోని జయరోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణిచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి