iDreamPost

దహన సంస్కారాలు చేస్తుండగా.. చితిపై నుండి ఎగసిపడ్డ నోట్ల కట్టలు

డబ్బు లోకం దాసోహం అనేది ఓ నానుడి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వాస్తవం. డబ్బు లేకపోతే మానవుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంతలా మానవుడితో మమేకమైన డబ్బును చచ్చిపోయేటప్పుడు కట్టుకుపోతాామా అని ప్రశ్నిస్తుంటారు. కానీ అది నిజమేనని నిరూపించాడు.

డబ్బు లోకం దాసోహం అనేది ఓ నానుడి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వాస్తవం. డబ్బు లేకపోతే మానవుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంతలా మానవుడితో మమేకమైన డబ్బును చచ్చిపోయేటప్పుడు కట్టుకుపోతాామా అని ప్రశ్నిస్తుంటారు. కానీ అది నిజమేనని నిరూపించాడు.

దహన సంస్కారాలు చేస్తుండగా.. చితిపై నుండి ఎగసిపడ్డ నోట్ల కట్టలు

’ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం‘ అని కవి ఊరికనే చెప్పలేదు. డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏ పని జరగదు. అసలు ఎందుకు మనిషికి విలువ కూడా ఉండదు. మనుషుల్లో నవరసాలు పలికించగల సత్తా దేనికైనా ఉందంటే అది ధనం మాత్రమే. అందుకే ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బులు ఏమన్నా చచ్చిపోయేటప్పుడు తీసుకెళతామా అంటుంటారు కానీ.. చనిపోతే.. ఆ మృతదేహాన్ని మోసుకెళ్లగలిగే నలుగుర్ని కూడా ఈ డబ్బు కొనగలదు. అయితే బతికి ఉండగానే కాదూ చితికి నిప్పంటించే సమయంలో కూడా డబ్బులు అవసరమనుకున్నాడేమో ఓ పెద్దాయన.. కట్టెకాలే సమయంలో కూడా డబ్బును తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

ఈ వింత ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. మృతదేహానికి తలకొరువు పెడుతుండగా.. అతడి తలపై పెట్టిన దిండు నుండి రూ. 500 నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. దీంతో ఆశ్చర్యంగా చూసిన బంధువులు.. డబ్బులను తీసుకునేందుకు ఎగబడ్డారు. నిప్పుల్లో నుండి దిండును బయటకు తీశారు. అప్పటికే చాలా రూ. 500 నోట్లు కాలిపోయాయి. మిగిలిన డబ్బును ఎలాగోలా తిప్పలు పడి బయటకు తీశారు. సగం కాలిన రూ. 500 నోట్లను మార్చేందుకు మృతుడి బంధువులు.. వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఇంతకు అతడు కోటీశ్వరుడు కాదూ కేవలం సగటు కూలీ. పూర్తి వివరాల్లోకి వెళితే.. అతడి పేరు నిమాయి సర్దార్.  బసిర్ హట్ సరిహద్దుల్లోని ఘోజదంగాలో నివసిస్తున్నాడు.

ఆయనకు ముగ్గురు కూతుళ్లు. ఆటో రిక్షా తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల అతడు వయో భారంతో కన్నుమూశాడు. ముగ్గురు కూతుళ్లే కావడంతో అతడి అంతిమ సంస్కారాలు చేసేందుకు ముందుకు వచ్చాడు మేనల్లుడు. ఇంట్లో ఉన్న దిండును అతడి తలకింద పెట్టి.. దహన సంస్కారాలకు తీసుకెళ్లారు. దహన సంస్కారాలు చేస్తుండగా.. ఒక్కసారిగా రూ. 500నోట్ల కట్టలు బయటకు రావడంతో అవాక్కయ్యారు అక్కడ ఉన్నవారంతా.. అందులో కొంత డబ్బు కాలిపోయింది. మిగిలిన డబ్బును బంధువులు తీయగా.. వాటిని మార్చేందుకు తిప్పలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు వాటిని మార్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి