iDreamPost

‘ఖైదీ-2’ కోసం షార్ట్ ఫిల్మ్ తీస్తున్న లోకేష్ కనగరాజ్! లింకప్ అదిరింది!

  • Published Dec 13, 2023 | 5:16 PMUpdated Dec 13, 2023 | 5:16 PM

సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్​తో తన మూవీస్​పై ఆడియెన్స్​లో ఎక్స్​పెక్టేషన్స్​ను భారీగా పెంచేస్తున్నారు లోకేష్ కనగరాజ్. అలాంటి ఆయన తీయనున్న ‘ఖైదీ 2’ ఫిల్మ్​కు సంబంధించి ఓ అప్​డేట్ బయటకు వచ్చింది.

సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్​తో తన మూవీస్​పై ఆడియెన్స్​లో ఎక్స్​పెక్టేషన్స్​ను భారీగా పెంచేస్తున్నారు లోకేష్ కనగరాజ్. అలాంటి ఆయన తీయనున్న ‘ఖైదీ 2’ ఫిల్మ్​కు సంబంధించి ఓ అప్​డేట్ బయటకు వచ్చింది.

  • Published Dec 13, 2023 | 5:16 PMUpdated Dec 13, 2023 | 5:16 PM
‘ఖైదీ-2’ కోసం షార్ట్ ఫిల్మ్ తీస్తున్న లోకేష్ కనగరాజ్! లింకప్ అదిరింది!

సినిమాటిక్ యూనివర్స్.. ఈ మాట ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్​సీయూ) నుంచి ఈ వర్డ్ ట్రెండింగ్​ అవుతోంది. అయితే హాలీవుడ్​లో సినిమాటిక్ యూనివర్స్​లు ఎప్పటి నుంచో ఉన్నాయి. లెజెండరీ ఫిల్మ్ మేకింగ్ స్టూడియోస్ అయిన మార్వెల్, డిస్నీలు ఈ కాన్సెప్ట్ బేస్ట్​గా ఎన్నో మూవీస్ తీశాయి. ‘అవెంజర్స్’ అలాంటి సిరీసే. అయితే ఇండియాలో మాత్రం ఈ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది. దీనికి ఆద్యుడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్​ను చెప్పొచ్చు. పలు బ్లాక్​బస్టర్ మూవీస్​తో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు లోకేష్. ఆయన తీసిన ‘ఖైదీ’ మూవీ అటు తమిళనాడుతో పాటు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్​హిట్​గా నిలిచింది.

స్టార్ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ మూవీ ఊహించని రేంజ్​లో భారీ విజయం సాధించింది. అయితే ఈ చిత్రం తర్వాత విజయ్​తో ‘మాస్టర్’ తీశారు లోకేష్ కనగరాజ్. అది యావరేజ్​గా నిలిచినప్పటికీ అనంతరం తీసిన ‘విక్రమ్’ మాత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ పాత రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేసేసింది. లోకనాయకుడు కమల్ హాసన్​ కెరీర్​కు బిగ్ బూస్టప్​గా నిలించిందీ ఫిల్మ్. అయితే ‘విక్రమ్’కు ముందు తీసిన ‘ఖైదీ’ నుంచే లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్​ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ‘విక్రమ్​’లో రివీల్ చేశారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘లియో’ కూడా ఎల్​సీయూలో భాగం కావడం విశేషం. ‘ఖైదీ’ నుంచి ‘లియో’ వరకు ప్రతి మూవీలోనూ కథతో పాటు కొన్ని పాత్రల్ని ఎల్​సీయూలో లింకప్ చేస్తున్నారు.

‘ఖైదీ’లో నటించిన కానిస్టేబుల్ క్యారెక్టర్​ను ‘లియో’లోనూ రిపీట్ చేసి తన సినిమాటిక్ యూనివర్స్​లోని స్పెషాలిటీని ఇప్పటికే ఆడియెన్స్​కు రుచి చూపించారు లోకేష్ కనగరాజ్. త్వరలో ఆయన ‘ఖైదీ 2’ సీక్వెల్​ను తెరక్కెక్కించనున్నారు. ఇది కూడా ఎల్​సీయూలో భాగమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ తరుణంలో మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ‘ఖైదీ’తో పాటు ‘విక్రమ్’లో కీలక పాత్రలో నటించిన నరైన్ అనే యాక్టర్ మాట్లాడుతూ.. ఓ ఊహించని అప్​డేట్​ను రివీల్ చేశారు. లోకేష్ కనగరాజ్ ఓ షార్ట్ ఫిలిం తీస్తున్నారని తెలిపారు.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్​కు అసలు మూలం ఏంటనేది చెప్పేలా దీన్ని ఆయన రూపొందిస్తున్నారని అన్నారు నరైన్. ఇది ‘ఖైదీ 2’కి కూడా లింకప్ ఉండేలా అయితే ఉంటుందని పేర్కొన్నారు. ‘ఖైదీ’ సీక్వెల్​ రిలీజ్​కు ముందే దీన్ని లోకేష్ విడుదల చేస్తారని చెప్పారు. ఈ ఊహించని అప్​డేట్​ వల్ల ఇప్పుడు ‘ఖైదీ 2’ మీద ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని మూవీ లవర్స్ అంటున్నారు. క్రేజీ న్యూస్ రివీల్ చేసిన నరైన్​కు థ్యాంక్స్ చెబుతున్నారు. మరి.. ఎల్​సీయూ మీద రానున్న ఈ షార్ట్ ఫిలిం కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సలార్‌కు ఆ సినిమాల దెబ్బ.. ఆ రికార్డు కష్టమే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి