iDreamPost

ఇదేందయ్యా ఇదీ : 12 కేసులు ఉంటేనే లోకేష్ తో మాట్లాడే హక్కట

ఇదేందయ్యా ఇదీ : 12 కేసులు ఉంటేనే లోకేష్ తో మాట్లాడే హక్కట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పేరు చెబితే వెంటనే స్ఫురించే పదం పప్పూ. ఈ పేరును మొదట ఆయనకు ఎవరుపెట్టారో తెలియదు కానీ చివరికి ఆ పేరును సార్థక నామధేయంగా చేసుకున్నారు నారా లోకేష్. తాజాగా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దఎత్తున ప్లాన్ చేశారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వేదికగా కొన్ని కార్యక్రమాలు చేపడితే నారా లోకేష్ మంగళగిరి వ్యాప్తంగా ర్యాలీ వంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అక్కడి దాకా బాగానే ఉంది కానీ ఈ మధ్య తెలుగు మీద పట్టు వచ్చింది అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆయన చేసిన కొన్ని పద ప్రయోగాలు తనని తానే కౌంటర్ వేసుకునే విధంగా మారాయి.

దానికి తోడు ఆయన చేసిన మరిన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. నారా లోకేష్ మాట్లాడిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ దేవుడు, చంద్రన్న రాముడు, లోకేష్ మూర్ఖుడు అనే వీడియో గురించి. స్వర్గీయ నందమూరి తారకరామారావు దేవుడట.! ఔను, కొందరు అవునన్నా కాదన్నా రాముడు ఎలా ఉండేవాడు లేదా కృష్ణుడు ఎలా ఉండేవాడు అని అడిగితే ఆయనలా ఉండేవాడు అనిపించేలా జనాల్లోకి ఆ ఫీలింగ్ తీసుకు వెళ్ళ గలిగాడు ఎన్టీఆర్. టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడు రాముడట. అయితే, ఈ విషయంలో చాలామందికి చాలా అభ్యంతరాలున్నాయి అయినా సరే టిడిపి శ్రేణుల వరకు రాముడు అని అనుకున్నా. కానీ నారా లోకేష్ మూర్ఖుడట. స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి, నమ్మక తప్పదు.ముందునుంచి చాలామంది ఆయనను పప్పు అని పిలిచేవారు. దానికి పర్యాయపదంగా ఉండేలా మూర్ఖుడిని అని ఆయనే ఒప్పుకున్నారు.

ఆ తరువాత ఒక్కొక్కరి మీదా కనీసం పన్నెండు కేసులు వుంటేనే, టీడీపీ కోసం గట్టిగా పోరాడిన నాయకుడిగా గుర్తింపునిస్తారట. అంతేకాదు పన్నెండు కేసులు ఉన్న వారికే నారా లోకేష్ ను కలిసే హక్కు దక్కుతుందట. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏమో కూడా అర్థంలేని మాటలతో, తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టాలని అనుకుంటున్నారో, వాళ్లు తమ అధినేతలు చూసుకుంటారని రెచ్చిపోయి రోడ్డెక్కితే పోలీసులు ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దాన్ని ప్రభుత్వం మీద నెట్టేద్దామని అనుకుంటున్నారో తెలియదు కానీ నారా లోకేష్ మాట్లాడుతున్న మాటలు విశ్లేషకులకు సైతం ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. నాయకుడు అంటే ప్రజలకే కాదు కార్యకర్తలకు కూడా భరోసా కల్పించాలి కానీ కేసులు ఉంటేనే కలిసే హక్కు అని చెప్పడం, ఒక రకంగా రెచ్చగొట్టే వ్యవహారమే తప్ప మరొకటి కాదు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఒక రౌడీ అవ్వాలని ఇంత నేరుగా మాట్లాడుతున్న నారా లోకేష్ మీద సుమోటోగా కేసులు పెట్టినా తప్పులేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి