iDreamPost

ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం.. అనుమతి ఇచ్చిన స్పీకర్!

ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం.. అనుమతి ఇచ్చిన స్పీకర్!

ప్రస్తుతం  పార్లమెంట్ వర్షకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఉభయ సభలు విపక్షాల నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై ప్రభుత్వం తరపున ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విపక్షలు మరో వ్యూహాన్ని సిద్ధం చేశాయి. ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని భావించాయి.  అందుకు తగినట్లు ఎన్డీయే కూటమితో ఏర్పడిన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అంత రంగం సిద్ధమైంది. విపక్షాలు  ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు.

మణిపూర్ అంశంపై విపక్ష కూటమి ప్రభుత్వంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని చర్చకు రావాలన్న డిమాండ్ కు కేంద్ర సంసిద్ధత వ్యక్తం చేయడం  లేదు. అలానే దీర్ఘకాలిక చర్చకూ సిద్దంగా లేదు. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానానికి విపక్ష  కూటమి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానకు తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనబోతోంది.

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్  గొగోయ్ సమర్పించిన  ఈ తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం  ఆమోదం తెలిపారు. దీనిపై చర్చకు  తేదీని త్వరలోనే ఖరారు చేయబోతున్నారు. ఓం బిర్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చ కోసం తగిన తేదీని నిర్ణయించేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చిస్తానని తెలిపారు. దీనిపై చర్చించే తేదీని సభ్యులందరికీ తెలియజేస్తామన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై బీఎస్పీ ఎంపీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వలేమి ఉందని బీఎస్పీ ఎంపీ మలూక్  అన్నారు. ఎవరైన  ప్రధాన మంత్రి , ప్రభుత్వం బలహీనంగా  ఉన్నప్పుడు  అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానం గురించి కనీసం ఆలోచించి ఉండవలసింది కాదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మరింత బలహీనపడతాయని చెప్పారు. అదే జరిగితే, దేశం మరింత బలహీనపడుతుందన్నారు. బీజేపీ మరింత నిరంకుశంగా ప్రవర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, ఆ పార్టీ నేతలు మరింత బాగా ఆలోచించి, అడుగులు వేయాలన్నారు. ఇక అవిశ్వాస తీర్మానం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చింది. అయితే ఈ పార్టీ అటూ ఎన్డీయేలోనూ, ఇండియా కూటమిలోనూ లేదు. మరి.. ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్  అనుమతించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి