iDreamPost

లాక్ డౌన్ వేళ ఆపన్న హస్తం అందిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే

లాక్ డౌన్ వేళ  ఆపన్న హస్తం అందిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి నిత్యావసరాలకు , కూరగాయలకు ప్రజలు పడుతున్న ఇక్కట్లు గమనించి పలువురు నేతలు వారి అవసరాలు తీర్చాటానికి ముందు కొచ్చి సామాన్య ప్రజలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు . ఆ కోవలో ముందు వరుసలో అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతుల్ని చెప్పుకోవచ్చు .

దాదాపు దశాబ్దం నుండి దుద్దుకుంట ఫౌండేషన్ ద్వారా సొంత ట్యాంకర్స్ తో పుట్టపర్తి ప్రజల దాహార్తి తీరుస్తున్న శ్రీధర్ రెడ్డి , లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి నియోజక ప్రజల అవసరాల్ని గుర్తించి తగు చర్యలు తీసుకొంటున్నారు . మొదటగా తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవటానికి ఇబ్బంది పడుతున్న రైతులకు టొమాటో , ఇతర కూరగాయలు మదనపల్లి మార్కెట్ లో , పండ్లు విజయవాడ మరికొన్ని ప్రాంతాలకు పంపి అమ్ముకొనే విధంగా ఏర్పాటు చేసిన శ్రీధర్ రెడ్డి , తొలుత నియోజక వర్గ ప్రజలకు దాదాపు ఎనభై వేల కుటుంబాలకు నాలుగు వందల టన్నుల కూరగాయలను పంచారు .

లాక్ డౌన్ కొనసాగుతుండటంతో రెండవ విడతగా నియోజక వర్గంలోని తొంభై వేల పై చిలుకు కుటుంబాలకు ఐదు కిలోల చొప్పున మొత్తం 450 టన్నుల కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని దుద్దుకుంట దంపతులు చేపట్టారు.ఈ కూరగాయలులో దాదాపు 75 శాతం సరుకు నియోజక వర్గంలో పండించిన కూరగాయలు కావటం విశేషం.ఈ కార్యక్రంలో ఒక వైపు రైతుల నష్టపోకుండా పంట అమ్ముకోగలుగుతున్నారు ,మరో వైపు ప్రజల అవసరం తీరుతుంది.

మరో వైపు లాక్ డౌన్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య ,పారిశుధ్య సిబ్బందికి, మున్సిపల్ స్టాఫ్ కి 25 కేజీల రైస్ బ్యాగ్, 5 కేజీల కంది పప్పు , ఇతర నిత్యావసరాల కిట్స్ అందజేశారు . అలాగే రెడ్ జోన్స్ లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్ , వలంటీర్స్ కి సొంత నిధులతో దుద్దుకుంట ఫౌండేషన్ తరపున పీపీఏ కిట్స్ అందజేశారు .

దీనితో పాటు త్రాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు దుద్దుకుంట ఫౌండేషన్ ట్యాంకర్స్ ద్వారా మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు .నియోజకవర్గంలోని తాండల మీద ప్రత్యేక దృష్టి పెట్టి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.శ్రీధర్ రెడ్డి కుటుంబం చేస్తున్న సహాయ కార్యక్రమాలతో బాగా వెనుక బడిన పుట్టపర్తి ప్రాంత ప్రజలు కష్టాలు తీరుతున్నాయి.శ్రీధర్ రెడ్డి చేస్తున్న సహాయ కార్యక్రమాలను పుట్టపర్తి ప్రజలు అభినందిస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి