iDreamPost

శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డుపై స్థానికులు ఆందోళన.. కారణం

శంషాబాద్ ఎయిర్ పోర్టు  రోడ్డుపై స్థానికులు ఆందోళన.. కారణం

నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. దీని వల్ల కుటుంబంలోని వ్యక్తులను కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల్లో పిల్లల్ని కోల్పోయి తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటే.. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాధలుగా మారిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మద్యం సేవించి వాహనం నడపడం, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్లలో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు వల్ల అనేక కుటుంబాలు నడి రోడ్డు మీద పడుతున్నాయి.  ప్రయాణీకుల రాకపోకలతో నిత్యం రద్దీగా మారిపోయింది హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డు. దీంతో అక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదాలపై  ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు స్థానికులు

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వెళ్లే రూట్‌లో నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో ఆందోళనకు దిగారు స్థానికులు. ఆ రోడ్డును బ్లాక్ చేసి పెద్ద యెత్తున నిరసన చేపట్టారు. దీంతో శంషాబాద్-గగన్ పహాడ్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఆందోళన కొనసాగుతుండటంతో వాహనాలను రోడ్లపై వదిలేసిన ప్రయాణీకులు.. తమ లగేజీతో విమానాశ్రయానికి పరుగులు పెడుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికుల ఆందోళన విరమింపజేసేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా , పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి