iDreamPost

పాలసీ దారులకు LIC గుడ్ న్యూస్.. ఆ పాలసీలపై కీలక నిర్ణయం!

పాలసీ దారులకు LIC గుడ్ న్యూస్.. ఆ పాలసీలపై కీలక నిర్ణయం!

ఎల్ఐసీలో పాలసీ చేస్తే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి కొండంత అండ. కష్టకాలంలో ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఆదుకుంటుంది. ఈ కారణంగానే ఎల్ఐసీకి ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ రంగంలో దూసుకెళ్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తన పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆ పాలసీలపై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రత్యేక రాయితీలను కల్పించనుంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఏ పాలసీలపై నిర్ణయం తీసుకుంది? ఆ వివరాలు మీకోసం..

ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్‌ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌ అక్టోబర్‌ 31,2023 వరకు కొనసాగనుంది. ఎల్ఐసీ ప్రీమియం గడువులోగా చెల్లించని పక్షంలో పాలసీ లాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గడువు తేదీలోగా చెల్లించకపోతే మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కు అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. కాగా పాలసీదారులకు భరోసా కల్పించేందుకు ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్‌ఐసీ ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది.

ఈ క్యాంపెయిన్‌లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్‌ క్యాంపెయిన్‌లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్‌ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పిస్తుంది. అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు. ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్‌సెషన్‌తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. ల్యాప్స్ అయిన పాలసీలు పునరుద్దరించుకునేందుకు కావాల్సిన పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను లేదా ఏజెంట్ ను లేదా అధికారక వెబ్ సైట్ ను సంప్రదించాలని ఎల్ఐసీ కోరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి