iDreamPost

మరోసారి అదే తప్పు చేస్తున్న ధోని! జడేజాలా రుతురాజ్‌ బలవుతాడా?

MS Dhoni- Ruturaj Gaikwad: చెన్నై జట్టుకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ధోని తప్పుకోవడంతో రుతురాజ్ కి ఛాన్స్ దక్కింది. అయితే.., ధోని కెప్టెన్సీ వదులుకోవడం ఒక చెత్త నిర్ణయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

MS Dhoni- Ruturaj Gaikwad: చెన్నై జట్టుకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ధోని తప్పుకోవడంతో రుతురాజ్ కి ఛాన్స్ దక్కింది. అయితే.., ధోని కెప్టెన్సీ వదులుకోవడం ఒక చెత్త నిర్ణయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరోసారి అదే తప్పు చేస్తున్న ధోని! జడేజాలా రుతురాజ్‌ బలవుతాడా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎన్ని జట్లు ఉన్నా.. అందులో చెన్నై సూపర్ కింగ్స్ స్థానం మాత్రం ప్రత్యేకం. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై ఇప్పటి వరకు ఏకంగా 5 సార్లు విజేతగా నిలిచిందంటే ఆ టీమ్ స్టామినా, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఈరోజు చెన్నై జట్టు ఇంత బలంగా ఉండటానికి ప్రధాన కారణం మాత్రం ది లెజండ్రీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. తొలి సీజన్ నుండి ఇప్పటి వరకు ఆ జట్టుకి ధోని మాత్రమే కెప్టెన్ గా ఉంటూ వచ్చాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ లు జడేజా లీడ్ చేసినా.. అవి నామ మాత్రంగానే మిగిలిపోయాయి. ఇక లాస్ట్ సీజన్ లో మళ్ళీ కప్ కొట్టడంతో అంతా ధోనికి తిరుగులేదు అంటూ కీర్తించేశారు. తమ నాయకుడి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్స్ పెట్టి, ఏకంగా ధోనీని దేవుడితో పోల్చేశారు. అయితే.. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ కి ముందే  మహీ కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో  అంతా షాక్ అవుతున్నారు. అందరూ ఇది ధోని గొప్పతనంగా కీర్తిస్తున్నారు. అయితే.. ధోని లైఫ్ లో తీసుకున్న అతి చెత్త నిర్ణయాల్లో ఇది ఒకటని కొంత మంది క్రీడా పండితులు వాదిస్తున్నారు.

వయసు మీద పడ్డాక కెప్టెన్సీ వదులుకోవడంలో తప్పు లేదు. కానీ.., ధోని అందరిలాంటి కెప్టెన్ కాదు. ఆ బ్రెయిన్ కంప్యూటర్ కన్నా స్పీడ్ గా పని చేస్తూ ఉంటుంది. అలాంటి ఎన్నో మెరుపు నిర్ణయాలతో ధోని ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇలాంటి ఓ మాస్టర్ బ్రెయిన్ ఆటగాడిని టీమ్ లో పెట్టుకుని.. కెప్టెన్సీ చేయడం ఏ ఆటగాడికైనా తలకు మించిన భారమే. నిజానికి జడేజా కూడా ఇక్కడే కెప్టెన్ గా ఫెయిల్ అయ్యాడు. 2022  సీజన్ లో జడేజాపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. జడ్డు ఆ సీజన్ లో ప్రత్యర్థుల వ్యూహాల గురించి కన్నా.., తన నిర్ణయాల పట్ల ధోని ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు.

Dhoni

ఆ సమయంలో జడేజా ఒత్తిడికి గురై సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది. అలా అని జడ్డు ఆటని అర్థం చేసుకోలేని తక్కువ ప్లేయర్ కాదు. అక్కడ కష్టం అంతా ధోని లాంటి లెజండ్ ని జట్టులో పెట్టుకొని కెప్టెన్సీ చేయాల్సి రావడమే. ఈ సీజన్ లో ధోని తొలి మ్యాచ్ కి ముందే నాయకత్వ బాధ్యతలను వదిలేశాడు. కానీ.., ఇప్పుడు కూడా మహీ జట్టులోనే ఉంటాడు. పిల్లాడైన రుతురాజ్ ఇప్పుడు ధోనీని మెప్పిస్తూ గ్రౌండ్ లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అతనికి యాజమాన్యం ఎంత స్వేచ్ఛ ఇచ్చినా..  కళ్ళ ముందు ధోని ఉన్నాడన్న భయం మాత్రం పోదు. ఇలాంటి లెక్కలన్నీ వేసుకునే క్రీడా పండితులు ధోని తీసుకుంది చెత్త నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.

ధోని.. ఆడినంత కాలం అతనే కెప్టెన్ గా ఉండాలి. అతను ఓ మహావృక్షం. అతని ముందు మరే చెట్టు ఎదగలేదు. అది అసాధ్యం కూడా. ఇప్పుడు అనవసరంగా రుతురాజ్ పై ఒత్తిడి పెరిగింది. అతను కూడా జడేజాలా విఫలమైతే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇన్నేళ్ళుగా చెన్నై జట్టు ఎంఎస్ ధోనీని తప్ప మరో బ్యాకప్ కెప్టెన్ ని తయారు చేసుకోలేకపోయింది. ఆ కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి