iDreamPost

Laththi Review లాఠీ రిపోర్ట్

. వరస ఫ్లాపుల తర్వాత తన మార్కెట్ మీద ఎంత తీవ్ర ప్రభావం పడిందో ఈ రోజు ఓపెనింగ్స్ చూస్తే అర్థమవుతోంది.

. వరస ఫ్లాపుల తర్వాత తన మార్కెట్ మీద ఎంత తీవ్ర ప్రభావం పడిందో ఈ రోజు ఓపెనింగ్స్ చూస్తే అర్థమవుతోంది.

Laththi Review లాఠీ రిపోర్ట్

నాలుగేళ్ల క్రితం అభిమన్యుడు రూపంలో హిట్ కొట్టాక మళ్ళీ సక్సెస్ లేకుండా పోయిన విశాల్ కొత్త సినిమా లాఠీ నయన్ కనెక్ట్ తో పాటు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరస ఫ్లాపుల తర్వాత తన మార్కెట్ మీద ఎంత తీవ్ర ప్రభావం పడిందో ఈ రోజు ఓపెనింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రమోషన్ల విషయంలో అంతా తానై తిరిగిన విశాల్ దీని మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ట్రైలర్ గట్రా చూశాక మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉందన్న అభిప్రాయం జనంలో కలిగింది. యువన్ శంకర్ రాజా సంగీతం లాంటి బలమైన సాంకేతిక వర్గాన్ని అండగా పెట్టుకున్న విశాల్ నిజంగానే బాక్సాఫీస్ మీద లాఠీ ఝుళిపించేలా మెప్పించాడా లేదా రిపోర్ట్ లో చూసేద్దాం
Lathithi review
పోలీస్ కానిస్టేబుల్ మురళికృష్ణ(విశాల్)చాలా సిన్సియర్. లాఠీని పట్టుకుని నేరస్థులతో నిజాలు చెప్పించడంలో స్పెషలిస్ట్. భార్యా కొడుకుతో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒక రేప్ కం మర్డర్ కేసులో నిందితుడిని డీల్ చేసే క్రమంలో సస్పెండ్ అవుతాడు. అయితే డీజీపీ రికమండేషన్ తో తిరిగి జాయినవుతాడు. ఆయన కోరిక మేరకు వీరా అనే కరుడుకట్టిన రౌడీతో తలపడేందుకు సిద్ధపడతాడు. దీంతో కుటుంబం రిస్క్ లో పడి ఉన్న ఒక్కగానొక్క నలుసు ఆ ముఠా చేతికి చిక్కుతాడు. డిపార్ట్ మెంట్ అతనికి సహాయం చేసిందా, తనొక్కడే ఎందుకు ఒంటరిగా తలపడాల్సిన పరిస్థితి వచ్చింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడటమే అసలు స్టోరీ

విశాల్ లో ప్రయత్నలోపం లేదు. ఎటొచ్చి అతను ఎంచుకుంటున్న కథలే దెబ్బ కొడుతున్నాయి. లాఠీలో తీసుకున్న పాయింట్ ఓకే అనిపించినా ట్రీట్మెంట్ మరీ పాతకాలం స్టైల్ లో రాసుకోవడంతో డ్రామా ఎక్కువైపోయి విపరీతమైన ల్యాగ్ అనిపిస్తుంది. వర్తమాన సామజిక సమస్యలను సంఘటనలు ఇరికించే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇవన్నీ గతంలో చూసేసిన ఫీలింగ్ ఇస్తాయి. సెకండ్ హాఫ్ ని మరీ లాజిక్స్ కి దూరంగా నడిపించిన తీరు క్లైమాక్స్ వచ్చేటప్పటికీ హీరో పాత్ర తాలూకు ఎమోషన్ ని జీరో చేసేసి చప్పగా ముగుస్తుంది. సామ్ సిఎస్ బీజీఎమ్ ఒక్కటే కొంత నయం. ఫైట్లు గట్రా పుష్కలంగా పెట్టినా రాతా తీతా రెండూ తగినంత మోతాదులో లేకపోవడంతో లాఠీ దెబ్బ విలన్ మీద కంటే ప్రేక్షకుల మీద తగిలి నొప్పిని మిగులుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి