iDreamPost

Lakshmi Durga : చిన్నా పెద్దా అలరించిన లక్ష్మిదుర్గ

కేవలం ఏడాది గ్యాప్ లో 1990 మణిరత్నం తీసిన 'అంజలి'తో నేషనల్ అవార్డు సాధించాక తన పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లో చిరంజీవి ముందు బెరుకు లేకుండా నటించడం అప్పట్లో సంచలనం.

కేవలం ఏడాది గ్యాప్ లో 1990 మణిరత్నం తీసిన 'అంజలి'తో నేషనల్ అవార్డు సాధించాక తన పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లో చిరంజీవి ముందు బెరుకు లేకుండా నటించడం అప్పట్లో సంచలనం.

Lakshmi Durga : చిన్నా పెద్దా అలరించిన లక్ష్మిదుర్గ

బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ దక్కాలంటే వాటిలో స్టార్ హీరోలు ఉండాలన్న రూలేమీ లేదు. కాకపోతే కమర్షియల్ గా సేఫ్ అవ్వాలంటే ఇది ఉత్తమ మార్గం కాబట్టి ప్రయోగాలు చేసేందుకు నిర్మాతలు ఇష్టపడరు. కానీ చిన్నపిల్లలతోనూ సక్సెస్ లు అందుకోవచ్చని నిరూపించిన దర్శకులు ఉన్నారు. అదెలాగో చూద్దాం. 1989లో విజయ్ కాంత్ ‘రాజనాడై’ సినిమాతో పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ షామిలికి తక్కువ టైంలో చాలా పేరొచ్చింది. కేవలం ఏడాది గ్యాప్ లో 1990 మణిరత్నం తీసిన ‘అంజలి’తో నేషనల్ అవార్డు సాధించాక తన పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లో చిరంజీవి ముందు బెరుకు లేకుండా నటించడం అప్పట్లో సంచలనం.

అలాంటి షామిలితో సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. కేవలం తననే ఆధారంగా చేసుకుని కథలు రాయడం మొదలుపెట్టారు. అలా వచ్చిందే దుర్గ. జంతువులతో సినిమాలు తీయడంలో అశేష పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న రామనారాయణ దుర్గ కథను సిద్ధం చేసుకుని షామిలి తండ్రిని ఒప్పించారు. ఆయన పేరు బాబు. నటుడు కావాలన్న లక్యంతో మదరాసు వచ్చి చిన్నా చితకా వేషాలు వేసి తన చిరకాల వాంఛను పిల్లల రూపంలో తీర్చుకున్నారు. షామిలి అక్క షాలిని(ఇప్పటి అజిత్ భార్య) కూడా అప్పట్లో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్. అతి చిన్న వయసులో దేశవిదేశాలు తిరిగిన అక్కాచెల్లెళ్లుగా వీళ్ళ గురించి కథనాలు వచ్చేవి.

దుర్గ కథలో షామిలిది డ్యూయల్ రోల్. అభం శుభం తెలియని ఓ చిన్నపాపను ఆస్తి కోసం చంపాలనుకున్న దుర్మార్గులు అచ్చం దుర్గ పోలికలోనే ఉన్న మరో పాపను తీసుకొస్తారు. కానీ ఆ ఇద్దరూ కలిసి విలన్ల భరతం పట్టడమే అసలు కథ. ఇందులోనూ కుక్క, కోతి, ఏనుగు లాంటి జంతువులను సందర్భానుసారంగా వాడారు రామనారాయణ. 1990 ఆగస్ట్ లో విడుదలైన దుర్గ తమిళంలో సూపర్ హిట్ కొట్టింది. తెలుగులో లక్ష్మిదుర్గ టైటిల్ తో 1990 అక్టోబర్ 12న రిలీజ్ చేస్తే ఇక్కడా విజయం సాధించింది. కన్నడలో భవాని పేరుతో 1991లో రీమేక్ చేస్తే అక్కడా ఫలితం రిపీట్ అయ్యింది. ఈ బేబీ షామిలినే సిద్దార్థ్ ఓయ్, నాగశౌర్య అమ్మమ్మగారిల్లులో హీరోయిన్

Also Read : Chittemma Mogudu : విచిత్రమైన ట్విస్టుతో బోల్తా కొట్టిన డ్రామా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి