iDreamPost

ఆ రికార్డు సాధించడమే తన డ్రీమ్ అంటున్న కుల్దీప్ యాదవ్!

  • Author singhj Published - 07:42 AM, Mon - 25 September 23
  • Author singhj Published - 07:42 AM, Mon - 25 September 23
ఆ రికార్డు సాధించడమే తన డ్రీమ్ అంటున్న కుల్దీప్ యాదవ్!

ఇంటర్నేషనల్ క్రికెట్​లో రాణించడం అంత సులువు కాదు. ఇచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకొని టీమ్​లో తమ ప్లేస్​ను ఫిక్స్ చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు. పోటీ తీవ్రంగా ఉండే ఈ గేమ్​లో ప్లేయర్లు ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపర్చుకుంటూ ముందుకెళ్లాలి. అప్పుడే సుదీర్ఘ కాలం కెరీర్​ను కొనసాగించగలరు. గాయాలు, ఫామ్ లేమితో ఆటగాళ్లు జట్టులో చోటు కోల్పోవడం సాధారణమే. కానీ మళ్లీ కమ్​బ్యాక్ ఇచ్చి, కెరీర్​ను కొనసాగించడం ఆశామాషీ కాదు. అయితే ఇదంత కష్టం కాదని నిరూపించాడు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌.

ఇంజ్యురీ కారణంగా 2021లో భారత జట్టుకు దూరమయ్యాడు కుల్దీప్. అనంతరం అతడి మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అయితే మళ్లీ ఆడతాడో లేదో అనే స్టేజీ నుంచి తిరిగొచ్చిన ఈ చైనామన్​ బౌలర్ కమ్​బ్యాక్​లో అదరగొడుతున్నాడు. ఇటీవల భారత జట్టు ఆసియా కప్​ను గెలుచుకుందంటే అందులో కుల్దీప్ పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. స్పిన్​కు అనుకూలించిన లంక పిచ్​లపై ఆతిథ్య జట్టుతో పాటు పాకిస్థాన్ బ్యాటర్లను డ్యాన్స్ చేయించాడు కుల్దీప్. గత ఏడాదిన్నరగా అతడు బౌలింగ్​లో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. గాయం తర్వాత బౌలింగ్ శైలి మార్చుకున్న ఈ స్పిన్నర్.. వికెట్లకు మరింత చేరువగా వచ్చి బాల్స్ సంధిస్తున్నాడు.

రాబోయే వన్డే వరల్డ్ కప్​లో భారత బౌలింగ్​ అటాక్​లో కుల్దీప్ మెయిన్ అని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మధ్య ఓవర్లలో అతడు వికెట్లు తీయడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఇక, తన కెరీర్​లో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో కుల్దీప్ చెప్పుకొచ్చాడు. 2021లో ఐపీఎల్​లో ఆడే ఛాన్స్ రాలేదని.. ఆ తర్వాత గాయమైందన్నాడు. కోలుకున్న తర్వాత రనప్ మార్చడంతో స్పీడ్ పెరిగిందన్నాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీయాలని ఉందని.. ఆ రికార్డును సాధించాలనేది తన డ్రీమ్ అని కుల్దీప్ తెలిపాడు. ఒకవేళ తాను క్రికెటర్ కాకుంటే పైలట్ అయ్యేవాణ్నేమోనని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​కు ముందు లంకకు బిగ్ షాక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి