iDreamPost

ఈ ఫలితాలు BRSకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే: KTR

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఓటమికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. ఇక ఓటమిపై కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఓటమికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. ఇక ఓటమిపై కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ ఫలితాలు BRSకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే: KTR

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తామనుకున్న బీఆర్ఎస్ లీడర్లకు ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసిన గులాబీ దండుకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. కాగా ఓటమిని అంగీకరిస్తూ కేటీఆర్ సోషల్ మీడియాలో ట్వట్ కూడా చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని కార్తకర్తలు అధైర్యపడొద్దని సూచించారు.

మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. 119 స్థానాలకు 39 స్థానాలల్లో బీఆర్ఎస్ ను గెలిపించారు. సమర్ధవంతంగా ప్రతిపక్ష బాద్యతను నిర్వహిస్తాము. ఎదురు దెబ్బను గుణపాటంలా బావించి ముందుకు సాగుతాము. 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాము. చేసిన పని తో చాలా సంత్రప్తిగా ఉన్నాము. బీఆర్ఎస్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసిన నాయకులకు ధన్యవాదాలు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడుతాము అని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ కు అండగా నిలబడిన కార్యకర్తలకు ధన్యవాదాలు. ఓటమికి కారణాలను విశ్లేషణ చేసుకుంటాము. ప్రజలు అధికారం కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నాను. మేము కూడా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తాము. తొందరపడి కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టము.

ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే తెచ్చుకుందాం. దృడసంకల్పంతో పనిచేద్దాం. ఇది బీఆర్ఎస్ కు స్పీడు బ్రేకర్ మాత్రమే ఈ ఓటమికి కుంగిపోకూడదు. రానే రాదనుకున్న తెలంగాణను సాధించకున్నాము. అదే అంకితభావంతో పనిచేసి మళ్లీ విజయాలు సాదిద్దాం. గోడకు కొట్టిన బంతి ఏవిధంగా వెనక్కి వస్తుందో అదే విధంగా ప్రజల మన్నన తిరిగి పొందే విదంగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. స్వల్ప తేడాతో మా అభ్యర్థలు ఓడిపోయారు. మేము ఆశించిన ఫలితం రాలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును గౌరవించాలి. కేసీఆర్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు పంపారు. మేము పూర్తి స్థాయిలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సహకరిస్తాము. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి