iDreamPost

KTR ఆస​క్తికర వ్యాఖ్యలు.. ఆ ఒక్క పాట ప్రభుత్వాన్ని మార్చేసింది

  • Published Jan 17, 2024 | 12:12 PMUpdated Jan 17, 2024 | 12:12 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తరచుగా కామెంట్స్‌ చేస్తోన్న కేటీఆర్‌.. తాజాగా మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తరచుగా కామెంట్స్‌ చేస్తోన్న కేటీఆర్‌.. తాజాగా మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Jan 17, 2024 | 12:12 PMUpdated Jan 17, 2024 | 12:12 PM
KTR ఆస​క్తికర వ్యాఖ్యలు.. ఆ ఒక్క పాట ప్రభుత్వాన్ని మార్చేసింది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలయ్యింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం దారుణ ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల్లో కారు పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితం అయ్యింది. ఇక ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలసిందే. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యి.. నెల రోజులకు పైనే అవుతున్నా.. ఇప్పటికి పలు సందర్భాల్లో ఎన్నికల ఫలితాల గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్‌. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. శుభకార్యాలు జరుపుకుంటున్న పలువురు బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లకు వెళ్లి కలిశారు కేటీఆర్. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన ఆ‍త్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్‌. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. సర్పంచ్‌లు పదవి కాలం ముగిసిన తర్వాత వారిని గౌరవంగా సాగనంపాలనే ఉద్దేశంతోనే వారికి ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు కేటీఆర్‌.

పదవులు వస్తాయి పోతాయి.. అవి శాశ్వతం కాదు.. కానీ పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమన్నారు కేటీఆర్‌. అయితే.. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచి చేశారు కాబట్టే.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోవటాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఈ క్రమంలోనే.. “పల్లే కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రలా” అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసిందంటూ కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తెలంగాణలోలా ప్రతి పల్లెలో ఉన్న డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, ట్యాంకర్‌లు, ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.

సర్పంచులు చాలా కష్టపడి పనిచేశారంటూ వారిపై ప్రశంసలు కురిపించారు కేటీఆర్‌. స్వచ్ఛత విషయంలో 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 82 అవార్డులు వచ్చాయని.. దేశంలోనే 30 శాతం అవార్డులు రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అంతేకాక పెండింగ్ బిల్లుల సమస్యపై సర్పంచుల తరపున ప్రభుత్వంతో మాట్లాడడానికి.. గొంతు విప్పడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి