iDreamPost

BRS మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు తీవ్ర అస్వస్థత..!

  • Published Dec 08, 2023 | 12:33 PMUpdated Dec 08, 2023 | 12:33 PM

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడ్డాయి. ప్రచారాలు కూడా అదే రేంజ్ లో చేశారు. కానీ, ఫలితాల్లో మాత్రం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడ్డాయి. ప్రచారాలు కూడా అదే రేంజ్ లో చేశారు. కానీ, ఫలితాల్లో మాత్రం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు.

  • Published Dec 08, 2023 | 12:33 PMUpdated Dec 08, 2023 | 12:33 PM
BRS మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు తీవ్ర అస్వస్థత..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. నిన్నటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్ధం కాలం పాటు తెలంగాణ లో బీఆర్ఎస్ పరిపాలన కొనసాగించారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఈ బాధ మరువక ముందే.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడటంతో తుంటి ఎముకకు గాయమైందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ కి గాయం కావడంతో నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ మరో కీలక నేత అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..

బీఆర్ఎస్ లో వరుసగా జరుగుతున్న సంఘటనలు నేతలు, కార్యకర్తలో ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న రాత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. యశోద ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.. ఈ బాధ నుంచి కోలుకో ముందే మరో బీఆర్ఎస్ నేత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. టెస్టుల అనంతరం గుండెకు స్టంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అప్ డేట్ రావాల్సి ఉంది.

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 1997 లో తెలుగు దేశం పార్టీ తరుపు నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 2001 లో ఇబ్రహీం పట్నం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరుపు నుంచి గెలిచారు. 2009 లో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. 2009, 2010 ఉప ఎన్నికలు, 2014,2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ ఏడాది తాను పోటీ చేయడం లేదని స్వచ్చందంగా తప్పుకున్నారు. ఈ క్రమంలోనే విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్ కి అవకాశం ఇవ్వగా.. బీజేపీ అభ్యర్థి అర్వింద్ పై ఘన విజయం సాధించారు. మొదటి నుంచి బీఆర్ఎస్ కి విధేయులుగా ఉంటూ వస్తున్న కే విద్యాసాగర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడం కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి