iDreamPost

రాజ గోపాల్‌ రెడ్డి తీరుపై బీజేపీలో అయోమయం.. అసలు ఆయన వ్యూహం ఏంటి?

  • Published Oct 20, 2023 | 12:28 PMUpdated Oct 20, 2023 | 12:28 PM

తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు ముమ్మరం అవుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. కానీ బీజేపీ లో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సందడి లేదు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు ముమ్మరం అవుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. కానీ బీజేపీ లో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సందడి లేదు.

  • Published Oct 20, 2023 | 12:28 PMUpdated Oct 20, 2023 | 12:28 PM
రాజ గోపాల్‌ రెడ్డి తీరుపై బీజేపీలో అయోమయం.. అసలు ఆయన వ్యూహం ఏంటి?

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల గురించి టాక్ నడుస్తుంది. నవంబర్ 3 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. నవంబర్ 30న ఎన్నికలు.. డిసెంబర్ 3 న కౌంటింగ్ ఉండబోతుందని ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలైంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వైపు నుంచి అగ్రనేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ లో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. షెడ్యూల్ విడుదలై పదిరోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన రాజ గోపాల్ రెడ్డి పోటీపై ఉత్కంఠ కొనసాగుతుంది. వివరాల్లోకి వెళితే..

నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. మొదటి నుంచి కాంగ్రెస్ కి విధేయులుగా ఉంటు వరుస విజయాలు సాధిస్తున్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కి గుడ్‌బై చెప్పి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు నుంచి బై ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న రాజగోపాల రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న విసయంపై సందిగ్ధత నెలకొంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ విడుదల చేశాయి. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి లీస్ట్ రిలీజ్ చేయలేదు. అయితే మొదటి జాబితా 40 మంది అభ్యర్థులతో అదిష్టానానికి ప్రతిపాదనలు పంపారని.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకొని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఈసారి టికెట్ల కేటాయింపులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో అగ్ర నేతలు కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి, బండి సంజయ్.. కరీంనగర్ నుంచి, ఈటెల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నటి విజయశాంతి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నమరో స్థానం కామారెడ్డి నుంచి బరిలోకి దిగేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తైతే.. మొన్నటి వరకు కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ ఇటీవల బీజేపీ కండువా కప్పుకొని మునుగోడు నుంచి బై ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారని విషయం కన్ఫామ్ అయ్యింది. కానీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై అయోమయం నెలకొంది. ఆయన పోటీ చేసే స్థానంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి రాజ గోపాల్ రెడ్డికి పట్టు ఉన్న మునుగోడు నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల ఆయన మనసులో మాటగా ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ పెద్దలకు చెప్పడంతో కన్ఫ్యూజ్ మొదలైందని అంటున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఖారు చేసి పోటీలో దూసుకు పోతుంటే.. బీజేపీ మాత్రం ఇంకా వెనుకబడి ఉండటం.. అభ్యర్థులు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న అయోమయంలో ఉండటం పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైందని అంటున్నారు. ఇటీవల రాజ గోపాల్ మునుగోడు నుంచే పోటీ చేస్తానని చెప్పడం.. తర్వాత ఎల్బీ నగర్ ప్రస్థావనలోకి రావడంతో ఇంతకీ ఆయన వ్యూహం ఏంటీ.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఆలోచన పార్టీ శ్రేణుల్లో మొదలైంది. మరోవైపు రాజ గోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే.. ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని మునుగోడు నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ బయటకు వస్తే కానీ అసలు సంగతి ఏంటో తెలియదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి