iDreamPost

హీరో విశాల్ సంచలన ప్రకటన! ఈ తమిళ స్టార్స్ కి ఏమైంది? ఒకరి తరువాత ఒకరు!

  • Published Apr 15, 2024 | 12:46 PMUpdated Apr 15, 2024 | 12:46 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ హీరో ఓ ప్రెస్ మీట్ పాల్గొని తన రాజకీయ అరంగేట్రం కోసం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విశాల్ చేసిన వ్యాఖ్యలు అనేవి నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ హీరో ఓ ప్రెస్ మీట్ పాల్గొని తన రాజకీయ అరంగేట్రం కోసం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విశాల్ చేసిన వ్యాఖ్యలు అనేవి నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

  • Published Apr 15, 2024 | 12:46 PMUpdated Apr 15, 2024 | 12:46 PM
హీరో విశాల్ సంచలన ప్రకటన! ఈ తమిళ స్టార్స్ కి ఏమైంది? ఒకరి తరువాత ఒకరు!

కోలీవుడ్ స్టార్ హీరో ‘విశాల్’ గురించి అందరికి తెలిసిందే. పేరుకు తెలుగు హీరో అయినప్పటికి తమిళ్ లో మాత్రం స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ హీరోకు మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అంతేకాకుండా.. విశాల్ నటించిన ఏ సినిమాలకైనా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విశాల్ హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. సినిమాల్లోనే కాకుండా.. సామాజిక కార్యక్రమాలు చేయడంలో కూడా విశాలు ఎప్పుడు ముందుటారు. నిరంతరం ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకుంటూ విద్యార్థులకు, రైతులకు సేవ చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇక తమిళనాట ఈ హీరోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా విశఆల్ చెన్నైలోని జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొని తన రాజకీయ రంగప్రవేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా తమిళ్ హీరో విశాల్ చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కాగా, అక్కడ త్వరలోనే తాను రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించారు. అలాగే 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పార్టీ తరుపున బరిలోకి దిగుతా. ఇక పార్టీ ఏర్పాటు, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. అంతేకాకుండా.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలీంగ్ 100 శాతం జరగాలని ఆశిస్తున్నా’ అని విశాల్ చెప్పారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికోసమే నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కూడా తెలిపారు.

ఇక ఈ ప్రెస్ మీట్ లో ఒకవేళ మీరు ఏదైనా పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటారా అనే ప్రశ్న ఎదరవ్వగా.. అందుకు విశాల్ స్పందిస్తూ.. ‘మొదటిగా నన్ను నేను నిరూపించుకున్న తర్వాత పొత్తు గురించి మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తాను’ అని తెలిపాడు. ప్రస్తుతం విశాల్ చేసిన రాజకీయలోకి రానున్నరని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయం తెలిసుకున్న ఆయన అభిమానులు దళపతి విజయ్ బాటలోనే తమ అభిమాన హీరో కూడా వెళ్తున్నాడంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా.. ఇలా తమిళనాట సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల్లోకి రావడంతో.. చివరికి ఏ పార్టీ గెలుస్తుందో అని ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మరి, ప్రస్తుతం హీరో విశాల్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి