iDreamPost

Koffee With Karan 7: స‌మంత‌ షోలో నయనతారను త‌క్కువ‌చేసినందుకు కరణ్ జోహార్ పై ట్రోలింగ్, సౌత్ సినిమాపై ఎందుకంత అసూయ‌?

Koffee With Karan 7: స‌మంత‌ షోలో నయనతారను త‌క్కువ‌చేసినందుకు కరణ్ జోహార్ పై ట్రోలింగ్, సౌత్ సినిమాపై ఎందుకంత అసూయ‌?

కాఫీ విత్ కరణ్ 7 స‌మంత ఎపిసోడ్‌లో, హోస్ట్ కరణ్ జోహార్ సౌత్ సూప‌ర్ స్టార్ నయనతారను తేలిగ్గా తీసిపారేశాడు. అత‌ని కామెంట్ తో, ఫ్యాన్స్ బాగా హ‌ర్ట్ అయ్యారు.

క‌ర‌ణ్ జోహార్ కు ఈసారి సౌత్ స్పైస్ బాగా క‌ల‌సివ‌చ్చింది. స‌మంత‌-అక్ష‌య్ ఎపిసోడ్ మొత్తం క‌ర‌ణ్ జోహార్ షోను మ‌రో లెవెల్ కి తీసుకెళ్లింది. స‌మంత యాటిట్యూడ్, ఆమె నిక్క‌చ్చితనం, ఎమోష‌న్స్ అన్నీ షోను పండించాయి. ఇక షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7(Koffee With Karan 7) వివాదాలతోనే సోష‌ల్ మీడియాను ఎట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో సమంత-అక్షయ్ కుమార్ లు కనిపించారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల గురించి తమ హృద‌యాన్ని షో ముందుంచారు. ఇక స‌మంత వ్య‌క్తిగ‌త విష‌యాల‌నూ బైట‌పెట్టేసింది. నాగ చైతన్యతో విడాకుల గురించి కూడా సమంత మాట్లాడింది. కానీ, హోస్ట్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మంత స‌మాధానం చెప్పింది. కాని లిస్ట్‌లో నయనతార లేదని కరణ్ చెప్పడంతో అభిమానులు కరణ్‌పై సోష‌ల్ మీడియాలో నిప్పులు కురిపిస్తున్నారు.

కాఫీ విత్ కరణ్ 7లో, హోస్ట్ కరణ్ సమంతను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద మహిళా నటి ఎవరని అడిగితే, సమంత ఇటీవల విడుదలైన Kaathuvaakula Rendu Kaadhal గురించి మాట్లాడింది. అందులో నేను నయనతారతో సినిమా చేశానని చెప్పింది. అంటే దాన‌ర్ధం, సౌత్ ఇండియా సినిమా ఇండ‌స్ట్రీలో నయనతార బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్ అని సమంత చెప్ప‌డం. సమంత ఆన్స‌ర్ పై కరణ్ స్పందించాడు. ఆమె పేరు నా జాబితాలో లేదు కరణ్ చెప్పాడు. ఏంటీ? సౌత్ సూప‌ర్ స్టార్స్ లిస్ట్ లో న‌య‌నతార పేరులేదా? అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. సినిమాకు ప‌దికోట్ల రెమ్యునిరేష‌న్ తీసుకొంటున్న న‌టి గురించి అనాల్సిన మాటేనా ఇది? ఇది వాళ్ల అభ్యంత‌రం.

దేశంలోని దేశంలోని టాప్ యాక్ట్ర‌స్ (top female actors) పేర్ల‌లో, సమంతా నంబర్ వన్ స్థానంలో ఉన్న‌ట్లు చెప్పిన‌ ఓర్మాక్స్ మీడియా(Ormax Media) జాబితాను కరణ్ ప్రస్తావించారు. అంతే, తన షోలో నయనతారను అగౌరవపరిచినందుకు నెటిజన్లు కరణ్‌పై విరుచుకుపడ్డారు. నయనతార దక్షిణాది సూప‌ర్ స్టార్. కరీనా, ప్రియాంక చెప్రా రేంజ్ లో బాగానే స్థిరపడింది కాదా? యే కరణ్ కా ప్రాబ్లమ్ క్యా హై భాయ్ అంటూ ఒక యూజ‌ర్ కామెంట్ చేశాడు. క‌ర‌ణ్ కి దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే ఎందుకంత అసూయ‌? ఇది మ‌రో యూజ‌ర్ డౌట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి