iDreamPost

బాబాయి చిన్నిపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్!

Kesineni Swetha: టీడీపీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తాజాగా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

Kesineni Swetha: టీడీపీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తాజాగా విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి శ్వేత తన రాజీనామా లేఖను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

బాబాయి చిన్నిపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్!

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వాడీవేడీగా ఉన్నాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీలో అసమ్మత్తులు, రాజీనామాలు ఆ పార్టీకి తల నొప్పిగా మారాయి. ప్రస్తుతం విజయవాడ కేంద్రం టీడీపీలో రచ్చ జరగుతుంది. టీడీపీకి, కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాతూ..తన బాబాయి చిన్ని గురించి శ్వేత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

గతకొంతకాలంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాక పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే ఈ సారి ఆయనను కాదని తమ్ముడు చిన్నికి విజయవాడ ఎంపీ సీటు టీడీపీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనవరి 7 తిరువూరులో కేశినేని నాని ఫోటో లేదంటూ టీడీపీలోనే రెండు వర్గాలు వాగ్వాదం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన తిరువూరు జరిగిన సభకు కూడా కేశినేని నాని హాజరు కాలేదు. అంతేకాక తాను ఎంపీ పదవి, టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయన కుమార్తె విజయవాడ కార్పొరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. తన బాబాయి చిన్నిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేత మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా పార్టీలో తీవ్రమైన అవమానాలు భరిస్తున్నామని ఆమె తెలిపారు. తిరువూరులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. విజయవాడ లోక్ సభ స్థానం పరిధిలోనే తిరువూరు ఉందని, అది తమ ఊరని ఆమె అన్నారు. గౌరవం లేని చోట పని చేయలేమని శ్వేత తేల్చి చెప్పారు. ఇదే సమయంలో బాబాయ్ కేశినేని చిన్నితో నానికి వైరంపై మీడియా అడిగిన ప్రశ్నకు శ్వేత ఘాటుగా స్పందించారు.

ఇప్పుడు కొంతమందికి గురించి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోలేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమందికి నైతికి విలువలు లాంటివేవి ఉండవని తన చిన్నాన్న చిన్ని గురించి పరోక్షంగా అన్నారు. అతను తమ కుటుంబ సభ్యుడు కాదని చిన్నప్పుడే తాను భావించినట్లు శ్వేత పేర్కొన్నారు. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి తన  సమయాన్ని వృథా చేసుకోనని, అలాగే తన స్థాయిని తగ్గించుకోలేని శ్వేత స్పష్టం చేశారు. మరి.. కేశినేని చిన్నిపై కేశినేని శ్వేత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి