iDreamPost

వారం రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు.. కారణమిదే

  • Published Sep 16, 2023 | 2:05 PMUpdated Sep 16, 2023 | 2:05 PM
  • Published Sep 16, 2023 | 2:05 PMUpdated Sep 16, 2023 | 2:05 PM
వారం రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు.. కారణమిదే

విద్యార్థులకు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఏడు రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఇప్పుడు ఏం పండగ కూడా లేదు కదా.. మరి ఇప్పుడు ఎందుకు సెలవులు ఇచ్చారు.. మన దగ్గరేనా.. లేక ఇతర స్టేట్‌లోనా అంటే.. ఈ సెలవులు ఇచ్చింది కేర‌ళ‌లో. ప్రస్తుతం దైవభూమిని నిఫా వైర‌స్ వణికిస్తోంది. రాష్ట్రంలో వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో.. కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేరళలోని అన్ని పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవు. కేవలం కోజికోడ్ జిల్లాలోని స్కూళ్లకు మాత్రమే సెలవులు ఇచ్చారు. ఈ ప్రాంతంలోని విద్యాసంస్థల‌ను వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్‌ 24 వరకు.. వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు , ఇతర విద్యా సంస్థలు అన్నింటికి ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

ఇక శుక్రవారం మరో నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కావడంతో.. ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కేరళలో మొత్తం ఆరు నిఫా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిఫా వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ఉన్న 1,080 మందిని గుర్తించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 130 మందిని గుర్తించారు. వారిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్లు తెలిపారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నిఫా వైరస్‌ సంక్రమణ అనేది జూనోటిక్‌ వ్యాధి. అంటే ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం,నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. వైరస్‌ బారిన పడితే.. విపరీతమైన జ్వరం వస్తుంది. మరణాల రేటు దాదాపు 70 శాతం ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయలేదు.

నిఫా ఎలా వ్యాపిస్తుంది?

  • ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) లాలాజలం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే ఎవరైనా ఈ గబ్బిలాలు కొరికిన పళ్లు తింటే ఈ వైరస్‌ శరీరంలోకి ఎంటర్ అవుతుంది.
  • వైరస్ సోకిన ఏదైనా జంతువు బైట్ చేసిన ఫ్రూట్స్ తినడం వల్ల కూడా వైరస్ సోకుతుంది.
  • నిఫా సోకిన పందులు కూడా వైరస్ కు ప్రధాన కారకాలని అంటున్నారు.
  • వైరస్ సోకిన జంతువుతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా ఈ వైరస్ సోకే ప్రమాదముంది.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. వైరస్ సోకిన 4- 45 రోజుల్లోపు లక్షణాలు బయటపడే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి