iDreamPost

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కేసులో గ్రీష్మకు బెయిల్‌!

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన కేసులో గ్రీష్మకు బెయిల్‌!

శరాన్‌ మర్డర్‌ కేసుకు సంబంధించి గ్రీష్మకు ఊరట లభించింది. తాజాగా, కేరళ హైకోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రజల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని బెయిల్‌ ఇవ్వకుండా ఉండటం కుదరదని కోర్టు తే​ల్చి చెప్పింది. గ్రీష్మకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా జైల్లో ఉంటున్న ఆమె అతి త్వరలో బయటకు రానుంది. ఇక కేసు పూర్వాపరాల్లోకి వస్తే.. కేరళకు చెందిన గ్రీష్మ, శరాన్‌ రాజ్‌లకు కన్యాకుమారిలో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో పరిచయం అయింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, గ్రీష్మకు తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. ఆ పెళ్లి చేసుకోవటానికి గ్రీష్మ ఒప్పుకుంది. శరాన్‌కు బ్రేకప్‌ చెప్పింది. ఈ బ్రేకప్‌ను శరాన్‌ ఒప్పుకోలేదు. దీంతో అతడి అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని ఆమె భావించింది. అతడికి స్లో పాయిజన్‌ ఇస్తూ వచ్చింది. అతడు తాగే జ్యూసులలో స్లో పాయిజన్‌ కలిపి తాగిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలోనే అతడు ఆస్పత్రి పాలయ్యాడు. అతడి అవయవాలు ఒక్కోటిగా పనిచేయటం మానేశాయి. దాదాపు 15 రోజులు ఆస్పత్రిలో ఉన్న అతడు మరణించాడు. శరాన్‌ తల్లిదండ్రులు పెట్టిన కేసుతో.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు అధికారులకు గ్రీష్మ మీద అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. ఈ దారుణంలో ఆమె తల్లిదండ్రులు, మామ కూడా  భాగం అయినట్లు తేలింది. గ్రీష్మ అక్టోబర్‌ 21, 2022నుంచి జైల్లో ఉంటోంది. ఆమె జైలు శిక్ష అనుభవించబట్టి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరి, ప్రియుడ్ని చంపిన కేసులో గ్రీష్మకు బెయిల్‌ రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి