iDreamPost

కీర్తిరెడ్డి బర్త్‌డే స్పెషల్‌.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

చేసింది 14 సినిమాలు.. సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నది దాదాపు 20 సంవత్సరాలు.. అయినా కీర్తిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. తొలి ప్రేమ సినిమాతో ఆమె కుర్రకారు గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు.

చేసింది 14 సినిమాలు.. సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నది దాదాపు 20 సంవత్సరాలు.. అయినా కీర్తిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. తొలి ప్రేమ సినిమాతో ఆమె కుర్రకారు గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు.

కీర్తిరెడ్డి బర్త్‌డే స్పెషల్‌.. మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సక్సెస్‌ సాధించటం సాధారణ విషయం కాదు. అందం, అభినయం ఉన్నా కొన్ని సార్లు అనుకోని విధంగా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఇండస్ట్రీకి ఎంత దూరంగా ఉంటే.. జనం వారిని మర్చిపోవటానికి అంత అవకాశం ఉంటుంది. అయితే, ఇది అందరికీ వర్తించదు. కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంత దూరంగా ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. వారు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రలా మిగిలిపోతారు. అలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు హీరోయిన్‌ కీర్తి రెడ్డి.

కెరీర్‌ను మలుపు తిప్పిన ‘తొలిప్రేమ’

కీర్తిరెడ్డి.. ఎస్వీ క్రిష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘గన్‌ షాట్‌’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1996లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ వెంటనే ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండేళ్ల పాటు తమిళ సినిమాలకే పరిమితం అయ్యారు. దేవతై, నందిని, జాలీ, ఇనియవలే సినిమాల్లో నటించారు. తర్వాత 1998లో ‘తొలి ప్రేమ’ సినిమాతో మళ్లీ తెలుగువైపు వచ్చారు. ఈ సినిమా కీర్తి రెడ్డి సినిమా కెరీర్‌ను మలుపు తిప్పింది. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తొలిప్రేమలో కీర్తిరెడ్డి నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. అప్పటి వరకు చేసిన సినిమాలతో రాని గుర్తింపు.. ఈ ఒక్క సినిమాతో వచ్చింది. ఇప్పటికీ కీర్తిరెడ్డి అంటే.. తొలి ప్రేమ హీరోయిన్‌గా జనాలకు గుర్తు ఉన్నారు.

చివరి సినిమా.. పెళ్లి, విడాకులు 

కీర్తిరెడ్డి తన కెరీర్‌లో కేవలం 14 సినిమాలు మాత్రమే చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. హిందీలో మొదటి సినిమా అభిషేక్‌ బచ్చన్‌తో నటించారు. అయితే, ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదు. సంవత్సరానికి ఓ సినిమా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2004లో గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘అర్జున్‌’ సినిమాలో మహేష్‌ బాబు సోదరి పాత్ర చేశారు. ఇదే ఆమె నటించిన చివరి సినిమా. ఈ సినిమాలో నటనకు గాను సపోర్టింగ్‌ యాక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇక, ప్రముఖ హీరో సుమంత్‌తో పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2004లో సుమంత్‌- కీర్తిరెడ్డిల పెళ్లి జరిగింది. కానీ, వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగలేదు. వ్యక్తి గత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. 2006లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత కూడా ఆమె సినిమా పరిశ్రమ వైపు రాలేదు. అమెరికా వెళ్లి అక్కడే సెటిల్‌ అయిపోయారని సమాచారం. అక్కడ ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

కీర్తిరెడ్డి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు..

  • కీర్తిరెడ్డికి మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఆమె క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నారు.
  • ఫిట్‌నెస్‌పై ఆమెకు ఎంతో శ్రద్ధ. ఎరోబిక్స్‌ చేయాటాన్ని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు.
  • సాధారణంగా సినిమాకు డబ్బింగ్‌ చెప్పడాన్ని కొంతమంది ఇబ్బందిగా భావిస్తుంటారు. కానీ, కీర్తిరెడ్డి మాత్రం డబ్బింగ్‌ చెప్పటాన్ని ఎంజాయ్‌మెంట్‌లా ఫీలయ్యేవారు.
  • కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె ఒకే ఒక సినిమా చేశారు. అది కూడా కన్నడ సూపర్‌ స్టార్‌ ‘ఉపేంద్ర’తో. కేవలం ఉపేంద్ర కోసం ఆమె ‘సూపర్‌ స్టార్‌’ అనే సినిమాలో నటించారు. కన్నడలో నటించినని భీష్మించుకు కూర్చున్నా.. ఉప్పి కోసం ఆ రూల్‌ను పక్కన పెట్టారు.
  • కీర్తి రెడ్డి సోషల్‌ మీడియాకు, మీడియాకు చాలా దూరంగా ఉంటున్నారు. ఆమెకు ఎలాంటి సోషల్‌ మీడియా ఖాతాలు లేవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి