iDreamPost

KCR జిల్లాల పర్యటన.. మహిళా రైతుకు లక్షల రూపాయల ఆర్థిక సాయం

  • Published Mar 31, 2024 | 5:32 PMUpdated Mar 31, 2024 | 6:05 PM

పంటలు ఎండిపోయి బాధ పడుతున్న రైతులను పరమార్శించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఈ సందర్భంగా ఓ రైతుకు ఆర్థిక సాయం చేశారు. ఆ వివరాలు..

పంటలు ఎండిపోయి బాధ పడుతున్న రైతులను పరమార్శించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఈ సందర్భంగా ఓ రైతుకు ఆర్థిక సాయం చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 31, 2024 | 5:32 PMUpdated Mar 31, 2024 | 6:05 PM
KCR జిల్లాల పర్యటన.. మహిళా రైతుకు లక్షల రూపాయల ఆర్థిక సాయం

తెలంగాణ ఎన్నికలు ముగిసి సుమారు మూడు నెలలు గడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. రిజల్ట్ తర్వాత ఆయన కింద పడటంతో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం నల్లగొండలో సభ నిర్వహించారు. ఇక తాజాగా పంట ఎండిపోయి బాధపడుతున్న రైతులను పలకరించారు. దీనిలో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు కేసీఆర్.

సాగునీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదనతో ఉన్నారు. ఈ క్రమంలో అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు కేసీఆర్ ఆదివారం జిల్లాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా కేసీఆర్ జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్‌ తండాకు చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.

Financial assistance of lakhs of rupees to women farmers

ఈ క్రమంలో తన గోడు వెళ్లబోసుకున్న ఓ మహిళా రైతుకు ఆర్థిక సాయం అందించారు కేసీఆర్. నీళ్లందక పొలం ఎండిపోయిందని.. కొడుకు పెళ్లి ఉందని తమ బాధలు చెప్పుకున్న మహిళా రైతు కుటుంబానికి కేసీఆర్ రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ అనే మహిళా రైతు కేసీఆర్ ముందు తన గోడు వెల్లబోసుకుంది.

బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందంటూ విలపించింది. అంతేకాక తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని.. నీళ్లు లేక పంట ఎండిపోయిందని.. చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకోచ్చింది. ఆమె గోడు విని తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను గాలికి వదిలి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, రాజకీయాలలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతు బంధు, రైతు బీమా సాధించుకుందామని రైతులకు ధైర్యం చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి