iDreamPost

రైతును లక్షాధికారిని చేసిన టమాటా.. రాత్రికి రాత్రే అద్భుతం!

  • Published Jul 13, 2023 | 1:55 PMUpdated Jul 13, 2023 | 1:55 PM
  • Published Jul 13, 2023 | 1:55 PMUpdated Jul 13, 2023 | 1:55 PM
రైతును లక్షాధికారిని చేసిన టమాటా.. రాత్రికి రాత్రే అద్భుతం!

అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. ఇంతకు ముందు ఇలా అదృష్టం టాపిక్‌ వస్తే.. మనకు లాటరీ టికెట్‌లు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి టమాటా వచ్చి చేరింది. అవును మొన్నటి వరకు రూపాయికి కూడా కొరగాని టమాటా.. ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇన్నాళ్లు రూపాయికి కిలో ఇస్తామంటూ వచ్చిన వారే.. ఇప్పుడు ఏకంగా కేజీ టమాటా 100, 150 అంటుంటే జీర్ణించుకోవడం కష్టంగా మారింది. ఇక టమాటా కొనాలంటే సామాన్యులు భయపడుతుంటే.. రైతుల ముఖాల మీద మాత్రం కాస్త చిరునవ్వు కనిపిస్తోంది. అవును ఇన్నాళ్లు సరైన ధర లేక రోడ్డు పక్కన పారబోసి.. ఏడ్చుకుంటూ వెళ్లిన రైతన్న.. తాజాగా టమాటా ధర చూసి సంతోషపడుతున్నాడు. ఇన్నాళ్లు వ్యవసాయం వల్ల రైతన్నలు అప్పులపాలైన ఘటనలే చూశాం. కానీ తాజాగా టమాటా వల్ల.. రాత్రికి రాత్రే అన్నదాతలు లక్షధికారులుగా మారుతున్నారు. ఈ క్రమంలో టమాటా విక్రయించి లక్షల రూపాయలు సంపాదించాడు ఓ రైతు. ఆ వివరాలు..

ఇటీవల ఒక రైతు టమాటాలు అమ్మి ఒకే రోజున ఏకంగా 38 లక్షల రూపాయలు సంపాదించాడు. నమ్మడానికి కష్టంగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. మరి ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే కర్ణాటకలో. కోలార్‌ ప్రాంతంలోని బేతమంగళం జిల్లాకు చెందిన ప్రభాకర్‌ గుప్తా, అతని సోదరుడు.. గత కొన్నాళ్లుగా తమకున్న 40 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది వారు టమాటా సాగు చేశారు. దాంతో గుప్తా సోదరుల దశ తిరిగింది. ప్రస్తుతం టమాటా కేజీ 150-180 రూపాయలు పలుకుతుండటంతో వారు భారీగా లాభాలు ఆర్జించారు. ఈ క్రమంలో మంగళవారం ఒకే రోజున 2 వేల బాక్స్‌ల టమాటాలు విక్రయించి.. ఏకంగా రూ. 38 లక్షలు ఆర్జించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్‌ గుప్తా మాట్లాడుతూ.. ‘‘రెండు సంవత్సరాల క్రితం వరకు టమాటా ఒక్క బాక్స్‌ కేవలం 800 రూపాయలకు విక్రయించాం. ఈ ఏడాది మంచి ధర పలకడంతో.. ఒక్క బాక్స్‌ 1900 రూపాయలు పలికింది. మొత్తం 2 వేల బాక్స్‌లు అమ్మడంతో ఒకేరోజు 38 లక్షల రూపాయలు వచ్చాయి. మేం సాగు చేసే టమాటా ఎంతో నాణ్యంగా ఉంటుంది. తెగులు బారిన పడకుండా పంటను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ ఏడాది టమాటా వల్ల మా దశ తిరిగింది’’ అని సంబరపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి