iDreamPost

కన్నడలో కాసుల వర్షం కురిపించిన సినిమా! తెలుగులో ఏం చేస్తారో..

  • Author ajaykrishna Published - 11:03 AM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 11:03 AM, Tue - 8 August 23
కన్నడలో కాసుల వర్షం కురిపించిన సినిమా! తెలుగులో ఏం చేస్తారో..

ఇటీవల కాలంలో బాక్సాఫీస్ ని చిన్న సినిమాలు ఏ రేంజ్ లో ఊపేస్తున్నాయో చూస్తున్నాం. ఎలాంటి అంచనాలు లేకుండా.. బిగ్ స్టార్స్ లేకపోయినా.. కంటెంట్ తో సినిమాలు థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అదిగాక ఈ మధ్య ఆడియన్స్ సినిమాలను చూసే విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు హీరో హీరోయిన్స్ డ్యూయెట్ సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ తో సినిమాలు ఎంజాయ్ చేసేవారు. కానీ.. ఇప్పుడు హీరో ఎవరైనా కంటెంట్ ముఖ్యం అంటున్నారు. అంతెందుకు అభిమాన హీరోల సినిమాలను సైతం కంటెంట్ లేకపోతే లెక్క చెయ్యట్లేదు. అలాంటిది తాజాగా కన్నడ ఇండస్ట్రీని ఊపేసిన ఓ చిన్న సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గతేడాది కన్నడలో 777 చార్లీ, కేజీఎఫ్ 2, కాంతార లాంటి సినిమాలు బాక్సాఫీస్ ని ఊపేసి.. తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ఆ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే.. కేజీఎఫ్ 2, కాంతారల తర్వాత మళ్లీ కన్నడలో చెప్పుకోదగిన సినిమా రాలేదు. కానీ.. ఈ ఏడాది ఓ డెబ్యూ డైరెక్టర్ తీసిన చిన్న సినిమా.. కన్నడ ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చింది. నితిన్ కృష్ణమూర్తి అనే డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమా.. హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే. జులై 21న విడుదలైన ఈ క్రైమ్ కామెడీ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. ఈ సినిమా ఇప్పటికి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. కొంతకాలంగా ఏ భాషలో సినిమా హిట్ అయినా తెలుగులోకి డబ్ చేయడమో లేదా రీమేక్ చేయడమో జరుగుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ఓ హాస్టల్.. అందులో ఉండే కుర్రాళ్ళు, హాస్టల్ వార్డెన్ ల చుట్టూ తిరుగుతుంది. మంచి కామెడీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్.. ఇలా అన్ని చక్కగా కుదిరి సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. కాగా.. ఇప్పుడీ ‘హాస్టల్ హొడుగురు బేకాగిద్దరే’ మూవీని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే.. నేరుగా డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా? లేక కథ తీసుకొని రీమేక్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కంటెంట్ ప్రధానంగా ఆడింది. కాబట్టి.. తెలుగులో కూడా సినిమా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇక ఎవరు ఈ సినిమాని తెలుగులోకి తీసుకొస్తారో చూడాలి. మరి చిన్న సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి