iDreamPost

కంగన రనౌత్‌ విమర్శలు చేస్తున్న ఆ ఫేక్‌ జంట ఎవరిది?

కంగన రనౌత్‌ విమర్శలు చేస్తున్న ఆ ఫేక్‌ జంట ఎవరిది?

తరచూ వివాదాస్పద పోస్టులు, వ్యాఖ్యలతో వార్తలో నిలుస్తుంటారు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ మొత్తం ఓ వైపు అయితే.. తానో వైపు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలపై కూడా నేరుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. తనపై వచ్చే విమర్శలపై ఘాటుగానే స్పందిస్తూ ఉంటారు. తాజాగా, కంగనా ఓ స్టార్‌ జంటపై దారుణమైన కామెంట్లు చేశారు. సినిమాల కోసమే ఆ నటుడు పెళ్లి చేసుకున్నాడంటూ పేర్కొన్నారు. ఈ మేరకు కంగనా రనౌత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. ఆ స్టోరీలో..

‘‘ మరో న్యూస్‌లో.. ఒకే ఇంట్లో వేరు వేరు ఫ్లోర్లలో ఉండే భార్యాభర్తలు ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. ఆ భార్యాభర్తల తాజా ట్రిప్‌ ఎలా గడిచిందో ఎవ్వరూ రాయటం లేదు. ఆ భర్త నాకు మెసేజ్లు చేస్తున్నాడు.. నన్ను బతిమాలుతున్నాడు.. నన్నో సారి కలవాలని అంటున్నాడు. ఆ ఫేక్‌ జంట గురించి అందరికీ తెలియాలి. మీరు డబ్బుకోసం.. సినిమా ప్రమోషన్ల కోసం. పని కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది. ఆ నటుడు మాఫియా డాడికి భయపడి పెళ్లి చేసుకున్నాడు.

Kangana ranaut comments

ఆ డాడీ సినిమాలు ఇప్పిస్తానని తన కూతుర్ని ఆ నటుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే, ఆ సినిమా అవకాశాలు రాలేదు. దీంతో ఆ నటుడు ఫేక్‌ పెళ్లి బంధం నుంచి బయటకు రావాలని చూస్తున్నాడు. అయితే, అతడ్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. ప్రస్తుతం భార్యా, కూతురి మీద ఫోకస్‌ పెట్టాడు. ఇండియాలో ఓ సారి పెళ్లి అయితే చాలు, అంతా అయిపోయినట్లే’’ అంటూ రాసుకొచ్చారు. కంగన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టులు పెట్టిందో ప్రశ్నా‍ర్థకంగా మారింది. మరి, కంగనా రనౌత్‌ పెట్టిన ఈ పోస్టు ఎవరి గురించి అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి