iDreamPost

కమల్ హాసన్, శ్రుతి హాసన్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబో!

  • Published Mar 16, 2024 | 12:41 PMUpdated Mar 18, 2024 | 10:17 AM

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు మ్యూజిక్ ఆల్బమ్స్ నిర్మించడం కొత్త విషయమేమీ కాదు. కానీ, కమల్ హాసన్ దీనిని రూపొందించడం... రచయితగా వ్యవహరించడం మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు మ్యూజిక్ ఆల్బమ్స్ నిర్మించడం కొత్త విషయమేమీ కాదు. కానీ, కమల్ హాసన్ దీనిని రూపొందించడం... రచయితగా వ్యవహరించడం మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

  • Published Mar 16, 2024 | 12:41 PMUpdated Mar 18, 2024 | 10:17 AM
కమల్ హాసన్, శ్రుతి హాసన్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబో!

కమల్ హాసన్ గురించి అందరికి తెలిసిందే. అలాగే కమల్ తో పాటు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని .. సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న శృతిహాసన్ గురించి కూడా.. పెద్దగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరితో పాటు ప్రెసెంట్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా .. కొనసాగుతున్న క్రేజీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి కూడా అందరికి తెలుసు. మరి, ఈ ముగ్గురు స్టార్స్ కలిస్తే దాని రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి .. ఇప్పటికే ఓ ఇమాజినేషన్ వచ్చేసి ఉంటుంది. అవును.. ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. కానీ, అది సినిమా కాదు.. ఒక స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్ లో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కమల్, శృతి, లోకేష్ కనగరాజ్ చేపట్టబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ .. ఒక మ్యూజిక్ ఆల్బమ్. ఈ ప్రాజెక్ట్ లో ప్రతిదీ ప్రత్యేకమే.. ఎందుకంటే, ఈ ఆల్బమ్ ను కమల్ హాసన్ రూపొందించడంతో పాటు.. ఆ పాటకు రచయితగా వ్యవహరించారు. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే.. ఈ పాటను శృతిహాసన్ పాడడంతో పాటు సంగీతాన్ని అందించారు. ఇక ఈ స్పెషల్ ప్రాజెక్ట్ కు “ఇనిమేల్” అనే టైటిల్ ను నిర్ణయించారు. కాగా దీనికి ద్వారకేస్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు .. సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్.

అయితే, హీరోయిన్ శృతిహాసన్ కు సాంగ్స్ పాడడం, సంగీతాన్ని అందించడం ఇది తొలిసారి ఏమి కాదు. గతంలో కూడా శృతి హాసన్ ఎడ్జ్, షీస్ ఏ హీరో , మాస్టర్ మోషన్ పేర్లతో కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ ను రూపొందించింది. ఈ ఆల్బమ్స్ మ్యూజిక్ లవర్స్ కు చాలా నచ్చేశాయి. ఇక ఇప్పుడు ఈ స్టార్ కాంబోలో నిర్మించిన క్రేజీ ప్రాజెక్ట్ “ఇనిమేల్” అభిమానులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి. అలాగే, కమల్ హాసన్ ఈ సాంగ్ కు రచయితగా వ్యవహరించడంతో.. ఈ ఆల్బమ్ పై మరింత ఆశక్తి కనబరుస్తున్నారు అభిమానులు. మరి, ఈ క్రేజీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి