iDreamPost

TDP స్వార్థానికి బలైన పింఛన్ దారుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన CM జగన్

  • Published Apr 02, 2024 | 4:31 PMUpdated Apr 02, 2024 | 4:31 PM

టీడీపీ స్వార్థం కారణంగా ఏపీలో ఒక పింఛన్ దారుడు కన్ను మూశాడు. ఈ ఘటనపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

టీడీపీ స్వార్థం కారణంగా ఏపీలో ఒక పింఛన్ దారుడు కన్ను మూశాడు. ఈ ఘటనపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

  • Published Apr 02, 2024 | 4:31 PMUpdated Apr 02, 2024 | 4:31 PM
TDP స్వార్థానికి బలైన పింఛన్ దారుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన CM జగన్

అవ్వాతాతలు, వికాలంగులకు ప్రభుత్వాలు పింఛన్ ఇస్తుంటాయి. కానీ ఆంధప్రదేశ్ లో మాత్రమే.. ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేస్తారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన.. ఉదయాన్నే వాలంటీర్లు.. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి వారికి పింఛన్ అందజేస్తారు. కానీ టీడీపీ స్వార్థం కారణంగా ఈనెల దీనికి బ్రేక్ పడింది. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా టీడీపీ నేతలు ఈసీని కోరారు. దాంతో లబ్ధిదారులు తామే స్వయంగా సచివాలయాల వద్దకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతేకాక ఈ నెల మూడో తేదీన ఫించన్‌ అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో.. కొన్ని చోట్ల విషాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వృద్ధుడు ఈ నెల నుంచి వాలంటీర్లు పింఛన్ అందివ్వరనే వార్త తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడం కోసం తానే స్వయంగా సచివాలయానికి బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలోనే గుండెపోటుతో కన్నుమూశాడు.

కూలీ పని చేసుకుని పొట్ట పోసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈనెల నుంచి వాలంటీర్లు పింఛన్ ఇవ్వరనే ఆందోళనతో కన్నుమూశాడు. ఇక వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. దాంతో పాటు వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్ దారుడు చనిపోయారని తెలుసుకున్న జగన్ అతడి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాక చనిపోయిన వెంకట్రావ్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలంటూ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతిలో మరో వ్యక్తి..

తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలాడు. ఇదిలా ఉండగా.. పింఛన్ పంపిణీ వ్యవహారంలో.. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్‌ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి