జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తరచూ ఫైరవుతుంటారు. అయితే పవన్ కి ధీటుగానే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తుంటారు. ఇక సీఎం జగన్ అయితే దత్తపుత్రుడు అంటూ పవన్ పై విరుచక పడుతుంటారు. అయితే మరో నేత.. జగన్ ను మించి పవన్ పై విరుచుకపడుతున్నారు.
Arjun Suravaram
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చాలా రసవత్తరంగా ఉంటాయి. ఇప్పటి వరకు అధికార వైఎస్సాఆర్ సీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ నడిచేది. అయితే ఇటీవల జనసేన సైతం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చింది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ లు వేస్తుంటారు. అంతేకాక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పవన్ పై పరోక్షంకా సెటైర్లు వేస్తూ.. ఓ రేంజ్ లో ఆడుకుంటాడు. పవన్ కి సీఎం జగన్ అంటే నిద్రలో కూడా భయమే అని జనసేన పార్టీ నేతలే చెబుతుంటారు. అందుకే ఏపీలో వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారని పలువురు అభిప్రాయ పడుతుంటారు. అయితే ఇప్పటి వరకు అందరూ పవన్ పాలిట సీఎం జగనే మొగుడని అందరు భావిస్తున్నారు. అయితే జగన్ మించి మరోకరు ఉన్నారు. ఆయనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంటారు పాల్. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడ జరిగిన ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉంటుంది. ఇక తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తరచూ పాల్ ఫైర్ అవుతుంటారు. లోకమంతా కేఏ పాల్‌ను పొలిటికల్ కమెడియన్‌గా చూస్తోంది. కానీ జనసేన మాత్రం ఆయన్ను అలా చూడడం లేదని టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే పాల్.. పవన్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్‌పై మరోసారి పాల్ సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలోని బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి పాల్ నివాళి అర్పించారు. అనంతరం పాల్ మాట్లాడుతూ ప్యాకేజీ స్టార్ పవన్‌కు రూ.1000 కోట్లు ఇవ్వడంతో.. కాపులను టీడీపీకి అమ్మేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ తమ సామాజిక వర్గమైన కాపులను అమ్మేశారని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వంగవీటి రంగా గురించి ఆలోచించే కాపులెవరైనా, అభిమానులు టీడీపీలో ఉండకూడదని ఆయన అన్నారు.
రాష్ట్రం 29 శాతం ఉన్న కాపులకు అధికారం రావాలని కేఏ పాల్ ఆకాంక్షించారు. అంతేకాక కాపులనుకు ఓ సూచన కూడా చేశారు. ప్యాకేజి స్టార్‌ల వెనుక ఉంటారా? లేదంటే తనతో ఉంటారా? అనేది కాపులు తేల్చుకోవాలన్నారు. 30 సీట్లకు రూ.1500 కోట్లకు పవన్ అమ్ముడుపోయారని పాల్ తీవ్ర విమర్శ చేయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పవన్ పై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి.. పవన్ పాలిట కేఏ పాల్ మొగుడయ్యాడని సోషల్ మీడియా లో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.