iDreamPost

సుజాతకు గుడ్ బై – ఫన్నీగా సాగిన వీకెండ్

సుజాతకు గుడ్ బై – ఫన్నీగా సాగిన వీకెండ్

మొన్న గంగవ్వను ఆరోగ్య కారణాల రిత్యా బిగ్ బాస్ 4 నుంచి పంపించేశాక నిన్న కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనే అంచనాలకు అనుగుణంగానే జోర్దార్ సుజాతాకు గుడ్ బై చెప్పేశారు. గంగవ్వ వల్ల అఖిల్ సేవ్ అయ్యాడు. సోహైల్ కూడా గండం నుంచి తప్పించుకున్నాడు. ఇక సండే ఎలిమినేషన్ టాస్క్ లో ఏడుగురు మోనాల్, అభిజిత్, అమ్మ రాజశేఖర్, సుజాతా, లాస్య, నోయల్, అరియనా ఉండగా ఫైనల్ గా అమ్మతో పాటు సుజాత మిగిలింది. ఎవరు బయటికి వెళ్ళాలో తెలుసుకునేందుకు ఒక ఐస్ బార్ ని ఇద్దరినీ బద్దలు కొట్టమని నాగార్జున చెప్పాడు. అందులో ఉన్న ఫోటోలో ఆ పేరు ఉంటుంది. అది రాజశేఖర్ కే దొరికినప్పటికీ అందులో సుజాతా పేరు ఉండటంతో ఇక సెలవు తీసుకోక తప్పలేదు. 

అనూహ్యంగా తనే సాగనంపాల్సి రావడంతో అమ్మ రాజశేఖర్ బాగా ఎమోషనలైపోయి భోరున ఏడ్చేశాడు. హౌస్ లో తన చివరి మాటల్లో సుజాతా బిగ్ బాస్ వల్లే  గొప్ప గుర్తింపు వచ్చిందని ఇంట్లో వాళ్ళు గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నానని ఆనందం పంచుకుంది. హైదరాబాద్ కు వచ్చిన తొలిరోజుల్లో చిన్న ఉద్యోగం చేస్తే చాలు అనుకునే స్టేజి నుంచి ఇక్కడి దాకా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఎలిమినేషన్ అసలు ఊహించలేదట. బిగ్ బాస్ అంటేనే ఇలాంటి ట్విస్టులు కదా అని తనే తిరిగి సరిచెప్పుకుంది. ఇక సోహైల్ ని టార్గెట్ చేసిన సుజాతా ఈ వారం మొత్తం తనే గిన్నెలు తోమేలా టాస్కు ఇవ్వడంతో బాబు కష్టాలు మాములుగా ఉండేలా లేవు. దీని కన్నా ముందు కొంత సరదా ప్రహసనం సాగింది. సభ్యులను చీటీలు తీయించి వాళ్ళతో డంబ్ చరాడ్స్ ఆడించారు. మూగ సైగలా ద్వారా అవతలి వాళ్ళు సినిమా పేర్లను కనిపెట్టాలి. ఇది ఫన్నీగానే సాగింది. 

ఇక వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి టైటిల్స్ వచ్చినప్పుడు ఎవరు దానికి సూటవుతారని నాగార్జున అడగటం, అందరూ అభిజిత్ పేరు చెప్పడం ఆపై అరియనాతో కలిసి డాన్స్ చేయడం అలా గడిచిపోయింది. మరీ ఎగ్జైటింగ్ గా ఏమి లేకపోయినా టైం పాస్ కు ఇదంతా పనికొచ్చింది. మరికొన్ని వెరైటీ టాస్కులు కూడా జరిగాయి. అందులో భాగంగా మెహబూబ్ జోర్దార్ సుజాతాను ఎత్తుకుని 50 గుంజిళ్ళు తీయడం షాక్ ఇచ్చింది. దేత్తడి హారిక, సోహైల్ లు కూడా ఇలాంటి వాటిలో భాగం పంచుకున్నారు. ఇక ఈ అయిదో వారం తర్వాత ఇప్పుడు హౌస్ లో 13 మంది ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ సూచనలు కనిపించడం లేదు కానీ వీక్ డేస్ మధ్యలో ఎవరైనా వచ్చినా ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ కి నాగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న బయటికి టాక్ కు భిన్నంగా నాగ్ దాని ప్రస్తావన తీసుకురాలేదు. బహుశా కన్ఫర్మ్ కాలేదేమో. మొత్తానికి రెండు ఎలిమినేషన్లతో బిగ్ బాస్ 4 దాని ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి