iDreamPost

Jio Cinema Subscriptions: జియో నుంచి కొత్త ప్లాన్‌లు రూ.29కే బోలేడు ప్రయోజనాలు

  • Published Apr 25, 2024 | 1:02 PMUpdated Apr 25, 2024 | 1:02 PM

ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి ఏ సినిమా వస్తుంది అనేది అందరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో జియో సినిమా సబ్‌స్క్రైబర్లకు రెండు అదిరిపోయే ప్లాన్స్ ను అంబాటులోకి తీసుకుని వచ్చింది.

ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి ఏ సినిమా వస్తుంది అనేది అందరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో జియో సినిమా సబ్‌స్క్రైబర్లకు రెండు అదిరిపోయే ప్లాన్స్ ను అంబాటులోకి తీసుకుని వచ్చింది.

  • Published Apr 25, 2024 | 1:02 PMUpdated Apr 25, 2024 | 1:02 PM
Jio Cinema Subscriptions: జియో నుంచి కొత్త ప్లాన్‌లు రూ.29కే బోలేడు ప్రయోజనాలు

ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్రజల ముందుకు వచ్చేశాయి.. దీనితో చాలా మంది ఓటీటీ లో ప్రసారం అయ్యే సినిమాలను, సిరీస్ చూసేందుకు సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూనే ఉంటారు. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా తన సబ్స్క్రైబర్స్ ను పెంచుకునేందుకు.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను భారీగా తగ్గించింది. దాదాపు గతంలో ఉన్న ధరలకు దాదాపు సగానికి సగం ధరలను తగ్గించింది. మంచి సినిమాలను, సిరీస్ లను అందించడంలో జియో సినిమా ప్లాట్ ఫార్మ్ కూడా ముందంజలోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది ఈ ప్లాట్ ఫార్మ్. ఈ క్రమంలో ఇప్పుడు మరింత మంది సబ్స్క్రైబర్స్ ను పెంచుకునే దిశగా జియో సినిమా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 25 నుంచి కొత్త ప్లాన్స్ ను అంబాటులోకి తీసుకుని వచ్చింది. ఆ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

గతంలో జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో ప్రీమియం కంటెంట్ ను చూడాలంటే.. దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ధర రూ.59గా ఉండేది. ఇక ఇప్పుడు దీనిని కేవలం నెలకు రూ.29 చెల్లించి చూడొచ్చు. అది కూడా ఎటువంటి యాడ్స్ లేకుండా ఈ జియో సినిమాలో. సినిమాలు, సిరీస్ లు ఎంచక్కా చూసేయొచ్చు. పైగా క్వాలిటీ విషయంలోను ఏ మాత్రం తక్కువ చేయకుండా ఈ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 4కే క్వాలిటీ కంటెంట్ ను.. డౌన్ లోడ్ చేసుకుని మరి కావాల్సిన టైమ్ లో చూసుకునేందుకు వీలు కల్పించారు. ఇక ఫ్యామిలీ ప్లాన్ విషయానికొస్తే.. గతంలో దీని ధర నెలకు రూ.149 ఉండేది. కానీ ఇప్పుడు దీని ధర రూ.89కి తగ్గించారు. ఈ ప్లాన్ తీసుకుంటే ఒకేసారి నాలుగు డివైజ్ లలో ఒకేసారి ఇందులో ఉండే కంటెంట్ ను చూసే వీలు ఉంటుంది. దీనిలో కూడా యాడ్స్ లేకుండా సినిమాలను, సిరీస్ లను చూసేయొచ్చు. ఈ రెండు ఆఫర్స్ ద్వారా జియో సినిమా తమ సబ్స్క్రైబర్స్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది.

అలాగే ఇప్పటికే జియో సినిమా సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న వారికీ మాత్రమే కాకుండా.. ఐపీఎల్ లాంటి ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్ ను అందరికి అందుబాటులో ఉచితంగా అందిస్తోంది జియో సినిమా ఓటీటీ. ఇక జియో సినిమా ఓటీటీ లో ఉండే కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాలు, సిరీస్ లు ఈ ఓటీటీ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ధరలు తగ్గాయి కాబట్టి.. రానున్న రోజుల్లో మరింత మంచి కంటెంట్ ను జియో సినిమా ప్రేక్షకులకు అందించనుంది. ఇక ఈ ఓటీటీ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కలర్స్, నికెలోడియోన్ లాంటి ఛానెల్స్ ను కూడా చూసే అవకాశం ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి