iDreamPost

Jio News Plan: జియో నుంచి అద్భుత ప్లాన్.. రూ.234 కే 56 రోజుల ప్లాన్!

టెలికాం రంగంలో రిలయన్స్ జియోకి ప్రత్యేక స్థానం ఉంది. తరచూ చౌక ధరల్లో అనేక రకాల ప్లాన్ లను తన కస్టమర్లకు జియో అందిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ సరికొత్త ప్లాన్ ను జియో రిలీజ్ చేసింది. ఆ కొత్త ప్లాన్ ఏమిటంటే..

టెలికాం రంగంలో రిలయన్స్ జియోకి ప్రత్యేక స్థానం ఉంది. తరచూ చౌక ధరల్లో అనేక రకాల ప్లాన్ లను తన కస్టమర్లకు జియో అందిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ సరికొత్త ప్లాన్ ను జియో రిలీజ్ చేసింది. ఆ కొత్త ప్లాన్ ఏమిటంటే..

Jio News Plan: జియో నుంచి  అద్భుత ప్లాన్.. రూ.234 కే  56 రోజుల ప్లాన్!

రిలయన్స్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వ్యాపార రంగంలో రిలయన్స్ లేని సెక్టార్ లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు అన్ని రంగాల్లో రిలయన్స్ తన మార్క్ ను చూపిస్తుంది. ఇక రిలయన్స్ జియో టెలికాం రంగంలో తీసుకొచ్చిన పెను మార్పు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నిర్ణయాలతో జియో కోట్లాది మంది కస్టమర్లను పెంచుకుంది. అలానే తరచూ ఏదో ఒక సరికొత్త ప్లాన్ లను రిలయన్స్ జియో విడుదల చేస్తూ వినియోదారులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఓ సూపర్ ప్లాన్ తో వచ్చిన జియో.. తాజాగా మరో సరికొత్త ప్లాన్ ను రిలీజ్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు  చూద్దాం…

టెలికాం రంగంలో  రిలయన్స్ తనదైన మార్క్ ను చూపిస్తుంది. చవక ధరల్లో అనేక ప్లాన్లను కస్టమర్లకు జియో అందిస్తుంది. మిగిలిన టెలికాం కంపెనీలతో పొల్చితే.. రిలయన్స్ భిన్నంగా ప్లాన్లను వినియోగాదారులకు అందిస్తుంది. ఇటీవలే ఓటీటీతో పాటు అదనపు డేటాతో కొత్త ప్లాన్ ను జియో అందించింది. తాజాగా జియో ఫోన్ యూజర్ల కోసం కూడా కొత్తది, చౌకైన ఫ్లాన్ ను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్ తో చాలా తక్కువ ధరకే 56 రోజుల అపమిత డేటాను అందుకోవచ్చు.

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త రూ. 234 కే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. అయితే, ఈ ప్లాన్ ను కేవలం జియో భారత్ ఫోన్ యూజర్ల మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. జియో భారత్ ఫోన్ ను వినియోగిస్తున్న కస్టమర్లకు మాత్రమే ఈ కొత్త ప్లాన్ ను తీసుకుని, దాని లాభాలను అందుకునే అవకాశం వుంది. జియో అందిస్తున్న ఈ న్యూ ప్లాన్ స్మార్ట్ మొబైల్ ఫోన్లు, లేదా ఇతర వినియోగదారులకు వర్తించదు.  అయితే ఈ కొత్త ప్లాన్ ద్వారా జియో భారత్  ఎక్కువ లాభాలను తీసుకు వస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇక రిలయన్స్ జియో అందిస్తున్న ఈ కొత్త ప్లాన్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రిలయన్స్ జియో అందించిన రూ. 234 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల పరిమితిని అందిస్తుంది. ఈ గడువు కాలానికి గాను అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇలా కేవలం అపరిమిత కాల్స్ తో పాటు ఈరోజుకు 0.5 జీబీ  చొప్పున 56 పాటు డైలీ డేటా అందించనుంది. అయితే ఈ డేటా పరిమితి ముగిసిన తరువాత కూడా 64కేబీపీఎస్ స్పీడ్ వద్ద అపమిత నెట్ ను వినియోగించుకోవచ్చు. అలాగే పైన తెలిపిన కాల్స్, డేటా ప్రయోజనాలతో పాటుగా 28 రోజులకు 300 ఎస్ఎంఎస్ లను ఈ ప్లాన్ అందిస్తుంది. అలానే 56 రోజులకు గాను 600 ఎస్ఎంఎస్  ప్రయోజనాన్ని కూడా రూ.234 ప్రిపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. అలాగే జియోసావన్, జియో సినిమా యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెసన్ ను కూడా అందిస్తుంది. ఇలా జియో తరచూ అనేక సరికొత్త ప్లాన్  అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మరి..తాజాగా జియో అందించిన ఈ కొత్త ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి