iDreamPost

తండ్రి సినిమాలో, పిల్లల పాట: మంచు విష్ణు కూతుళ్ల‌ ఫ్రెండ్ షిప్ సాంగ్

తండ్రి సినిమాలో, పిల్లల పాట: మంచు విష్ణు కూతుళ్ల‌ ఫ్రెండ్ షిప్ సాంగ్

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న “జిన్నా”లో మొదటి పాట యూట్యూబ్ లో రిలీజైంది. ఈ పాట పాడింది ఎవరో కాదు విష్ణు కూతుళ్ళైన అరియానా, వివియానా. “ఇదే స్నేహం” అంటూ సాగిన ఈ పాట రాసింది భాస్కరభట్ల, స్వరపరిచింది అనూప్ రూబెన్స్. తెల్లటి గౌనుల్లో దేవదూతల్లా మెరిసిపోతున్న అరియానా, వివియానా ఈ పాటను చక్కగా పాడారు. అనూప్ రూబెన్స్ ఈ వీడియోలో పియానో వాయిస్తూ కనిపిస్తాడు. “ఫ్యూచర్ సింగర్స్” అంటూ నెటిజన్లు ఈ అక్కాచెల్లెళ్ళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరో రెండు వారాల్లో వచ్చే ఫ్రెండ్ షిప్ డేని దృష్టిలో ఉంచుకుని ఈ స్నేహ గీతాన్ని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అవా ఎంటర్టెయిన్ మెంట్ (AVA Entertainment) బ్యానర్లో వస్తున్న“జిన్నా” సినిమాలో విష్ణు పక్కన సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కనువిందు చేయనున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి