iDreamPost

జార్ఖండ్‌ పీఠంపై హేమంత్‌ సోరెన్‌

జార్ఖండ్‌ పీఠంపై హేమంత్‌ సోరెన్‌

జార్ఖండ్‌ శాషన సభ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమి విజయం సాధించింది. 81 స్థానాలున్న జార్ఖండ్‌ శాసన సభలో 41 సీట్లు మేజిక్‌ ఫిగర్‌ కాగా, కూటమి 47 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఇందులో జార్ఖండ్‌ ముక్తి మోర్చా 30 సీట్లు, కాంగ్రెస్‌ 16, ఆర్‌జేడీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఇక బీజేపీ 25 సీట్లు, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా మూడు, ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు సీట్లులో గెలుపొందారు.
సీఎం పీఠంపై హేమంత్‌ సోరెన్‌..
కూటమి విజయం సాధించడంతో అందులోనూ జార్ఖండ్‌ ముక్తి మోర్చా అత్యధికంగా 30 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్ర నూతన సీఎంగా ఆ పార్టీ అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే.

ఈ నేపథ్యంలో హేమంత్‌ సోరెన్‌ గురించి తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా కనబరుస్తున్నారు. హేమంత్‌ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. యువకుడైన హేమంత్‌ జార్ఖండ్‌ మాజీ సీఎం, ఆది వాసీ నేత శిబు సోరెన్‌ కుమారుడు.


హేమంత్‌ సోరెన్‌ నేపథ్యం ఇదీ..

తల్లిదండ్రులు : రూపి, శిబూ సోరెన్‌

భార్య: కల్పనా సోరెన్‌

జననం: 1975 ఆగస్ట్‌ 10

స్వస్థలం : రామ్‌గఢ్‌ జిల్ల, నేమ్రా గ్రామం.

విద్య: ఇంజనీరింగ్‌ ( డిస్‌కంటిన్యూ)
హాబీలు: క్రికెట్‌ ఆడడం, వంట చేయడం.


రాజకీయ జీవితం..

– 2005లో తొలిసారి దుమ్కా స్థానం నుంచి పోటీ చేశారు. జేఎంఎం తిరుగుబాటు నేత ష్టీఫెన్‌ మారండీ చేతిలో ఓటమి పాలయ్యారు.

– సోదరుడు దుర్గ హఠార్మణంతో హేమంత్‌ సోరెన్‌ 2009లో జేఎంఎం బాధ్యతలు చేపట్టారు.

– 2009–10 మధ్యలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
– 2010లో జార్ఖండ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

– 2013 జూలై 15న జార్ఖండ్‌ సీఎంగా 38 ఏళ్ల వయస్సులో బాధ్యతలు స్వీకరించారు.

– 2014మ డిసెంబర్‌ వరకు సీఎంగా కొనసాగారు.

– 2014 డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి