iDreamPost

జీడిమెట్ల: పిచ్చిదంటూ అవమానం.. అంతటితో ఆగక దారుణం

  • Published Feb 15, 2024 | 9:24 AMUpdated Feb 15, 2024 | 9:24 AM

పెళ్లై పదేళ్లు.. ఇద్దరు బిడ్డలు సంతానం.. మరి ఏం జరిగిందో తెలయదు.. ఆ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

పెళ్లై పదేళ్లు.. ఇద్దరు బిడ్డలు సంతానం.. మరి ఏం జరిగిందో తెలయదు.. ఆ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Feb 15, 2024 | 9:24 AMUpdated Feb 15, 2024 | 9:24 AM
జీడిమెట్ల: పిచ్చిదంటూ అవమానం.. అంతటితో ఆగక దారుణం

ఆమెకు వివాహమై 10 ఏళ్లు అవుతుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లైన నాటి నుంచి దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. కానీ కన్నవారు, కడుపున పుట్టిన వారి కోసం ఆమె వాటన్నింటిని భరిస్తూ.. సర్దుకుపోయి.. గుట్టుగా కాపురం చేసుకునేది. అత్తింటి వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓపికగా భరించింది. కానీ ఆమె పరిస్థితి పట్ల మెట్టినింటి వారు ఏమాత్రం జాలి చూపలేదు. పైగా కొత్తగా పిచ్చిదంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇన్ని అవమానాలు భరించిన ఆమె.. ఈ ఆరోపణలు తట్టుకోలేకపోయింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

జీడిమెట్లలో వివాహిత ఒకరు ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం.. తమ అ‍ల్లుడే కుమార్తెని ఉరి వేసి చంపాడని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్‌కు చెందిన వాసం సరిత చిన్న కుమార్తె సంధ్యారాణి (37)ని జీడిమెట్లకు చెందిన డేగల మధుసూదన్, పుష్పమ్మ చిన్న కుమారుడు సంతోష్ బాబుకు ఇచ్చి వివాహం చేశారు. పదేళ్ల క్రితం అనగా 2013లో వారి వివాహం అయ్యింది. ఇక పెళ్లి సమయంలో నాలుగున్నర లక్షల కట్నంతో పాటుగా తులం బంగారం కూడా కట్నంగా ఇచ్చారు.

సంధ్యారాణి దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే, వివాహమైన రెండేళ్ల నుంచి దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. భర్తతో పాటుగా అత్త, ఆడపడుచు, తోటి కోడలు, బావ కూడా సంధ్యారాణిని సూటి పోటీ మాటలతో చిత్రహింసలు పెట్టేవారు. ఇక తాజాగా వారి దాష్టికాలు హద్దు దాటాయి. ఏకంగా సంధ్యారాణికి పిచ్చి అంటూ ప్రచారం మొదలు పెట్టారు ఆమె అత్తింటి వారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంధ్యారాణి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.

అయితే తన కూతురు సంధ్యారాణిని చంపింది అల్లుడు సంతోష్ బాబే అని.. అతడే తమ బిడ్డను ఉరేసి చంపాడాడని మృతురాలి తల్లి సరిత ఆరోపించింది. నిత్యం అత్తతో పాటుగా భర్త, ఆడపడుచు, తోటి కోడలు, బావ కూడా తన కూతురిని మానసికంగా వేధించి, చచ్చిపొమ్మంటూ మాటలతో హింసించేవారని సరిత ఆవేదన వ్యక్తం చేసింది. గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లిన తమను కూడా నోటికిచ్చినట్లుగా తిడుతూ.. కించపరిచే వారని వెల్లడించింది. అయితే, ఇటీవలే బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన సంధ్యారాణిని.. ఆమె భర్త, ఆడపడుచులు తనకు పిచ్చి పట్టిందని, మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలంటూ అవమానించారని తెలిసింది.

తనకు జరిగిన అవమానాన్ని సంధ్యారాణి తన తల్లికి చెబుతూ.. తాను ఎక్కువ కాలం బతకనంటూ బోరున విలపించిందని చెప్పుకొచ్చింది సరిత. అలా చెప్పిన మరుసటి రోజే సంధ్యారాణి తన ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంధ్యారాణి హఠాన్మరణంతో బిడ్డలు తల్లి ప్రేమను కోల్పోయారని వాపోతున్నారు చుట్టు పక్కల వాళ్లు. ఇక తన కూతురు చావుకు కారణమైన అల్లుడు, అత్త, ఆడపడుచు, తోటి కోడలు, బావను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి