iDreamPost

ఓటమి పాలయిన జార్ఖండ్ సీఎం

ఓటమి పాలయిన జార్ఖండ్ సీఎం

జార్ఖండ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టికి ఘోర పరాజయం ఎదురైంది. 5 ఏళ్ళుగా అధికారం అనుభవించిన బి.జే.పిపై అక్కడ ప్రజలు పూర్తి వ్యతిరేకత చూపారనేది ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మొర్చా – కాంగ్రెస్ పొత్తుకే ప్రజలు పట్టం కట్టారు. మోడీ, అమిత్ షా తమ పూర్తి యంత్రాగాన్ని అక్కడ ఉపయోగించి ప్రచారం చేసినా ఫలితాలు సాధించడంలో విఫలమైంది. 5 ఏళ్ళు బి.జే.పి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న రఘుబార్ దాస్ కూడా ఓడిపోవడం బి.జే.పి కి ఏ స్థాయిలో ఎదురు గాలి వీచిందో చెప్తుంది. 1995 నుంచి 5 సార్లు శాశన సభ్యుడిగా తూర్పు జంషెడ్ పూర్ నియోజక వర్గం నుండి ఎన్నికైన రఘుబార్ దాస్ ఓడిపోవటం బిజేపి పార్టికీ కోలుకోలేని షాక్ అని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి