iDreamPost

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

Jagananna Vidya Deevena: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో అనే సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థుల చదువు కోసం ఆర్థిక భరోసాను కల్పించారు. ఈ క్రమంలోనే వారికి ఏపీ ప్రభుత్వం తరచూ గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా మరోసారి విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Jagananna Vidya Deevena: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో అనే సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థుల చదువు కోసం ఆర్థిక భరోసాను కల్పించారు. ఈ క్రమంలోనే వారికి ఏపీ ప్రభుత్వం తరచూ గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా మరోసారి విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేశారు. ఈ రెండు రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా పిల్లలకు మనం అందించే నిజమైన ఆస్తి చదువు అనే విషయాన్ని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అందుకే పేద విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అనేక పథకాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారికి తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతుంటారు. తాజాగా విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. మరి.. ఆ వార్త.. ఏమిటి? ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశి దీవెన వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ఈ పథకాల ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. తరచూ వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా జగనన్న విద్యాదీవెన డబ్బులను విడుదల చేయనున్నారు. తొలుత ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలని భావించినా ఈ నెల 19తేదికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఆ రోజున కర్నూలులో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి.

ఏపీలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం జగనన్న విద్యా దీవెన స్కీమ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప ఏటా ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి విద్యార్థుల తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోంది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులను నవంబర్ చివరి తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తోన్నారు.

గత నెలలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులు, తల్లుల పేరుతో ఉండే ఉమ్మడి బ్యాంకు అకౌంట్లోనే ఈ స్కీమ్ నిధులను జమ చేయనున్నట్లు తెలిపింది.ఉమ్మడి ఖాతాలేని వారు అకౌంట్ లేని వారు కొత్తగా తెరవాలని సూచించింది. ప్రస్తుతం సమయం తక్కువగా ఉన్నందున.. వచ్చే విడత నిధుల విడుదల నాటికి ఉమ్మడి అకౌంట్ ఉండేలా చూసుకోవాలని లబ్ధిదారులకు సూచించింది. ఆ ఖాతాలు లేకపోతే డబ్బులు పడవని స్పష్టం చేసింది. ఇదే సమయంలో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఉమ్మడి ఖాతా నుంచి మినహాయింపు ఇచ్చింది. మరి.. జగనన్న విద్యాదీవెన నిధుల విడుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి