iDreamPost

జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడని చెబుతున్న టీడీపీ మాజీ మంత్రి

జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడని చెబుతున్న టీడీపీ మాజీ మంత్రి

చరిత్ర ఆధారంగా వర్తమానం, భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే చరిత్ర ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు. టిడిపి నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇప్పుడు ఈ విషయాన్ని తూ. చా తప్పకుండా పాటిస్తున్నట్లు గా తెలుస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి మూడు నెలల్లో మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని నక్కా ఆనందబాబు చెప్పుకొస్తున్నారు.

చివరి మూడు నెలల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన నక్కా ఆనందబాబు.. గత చరిత్రను గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి దాదాపు 650 హామీలతో అధికారంలోకి వచ్చింది. అందులో ముఖ్యమైనవి.. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి. డ్వాక్రా రుణమాఫీ ని పూర్తిగా అటకెక్కించగా..రైతు రుణమాఫీ దశలవారీగా అంటూ ఐదు దశల గాను మూడు దశలు మాత్రమే చేశారు. ఆ దశలవారీగా ఇచ్చిన డబ్బు వడ్డీలకు సరిపోలేదన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నిరుద్యోగ భృతి ఎన్నికలకు మూడు నెలల ముందు ఇచ్చి.. ఇచ్చామనిపించుకున్నారు. ఎన్నికల్లో మేము నిరుద్యోగభృతి ఇచ్చాము, రుణ మాఫీ చేశామని చెప్పుకున్నారు. ఇలా తాము చేసిన ఘనతను బాగా గుర్తు పెట్టుకున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు..

ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు పై భవిష్యత్తును అంచనా వేస్తున్నారు.

మూడు దశల్లో మద్యపాన నిషేధాన్ని చేస్తామని..ఇందులో భాగంగా దుకాణాల తగ్గింపు, షాక్ కొట్టేలా ధరల పెంపు ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సందర్భంలో ప్రతి సభలోనూ చెప్పారు. నక్కా ఆనందబాబు ఒకసారి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో, సీఎం జగన్ ఎన్నికల సభల ప్రసంగాలను ఒకసారి వింటే ఇలా ప్రెస్మీట్లు పెట్టేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే ఇలాగే సెల్ఫ్ గోల్స్ పడే ప్రమాదం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి