iDreamPost

పొంగులేటి శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు.. తెల్లవారుజాము నుంచి

  • Published Nov 09, 2023 | 9:24 AMUpdated Nov 09, 2023 | 9:24 AM

తెలంగాణలో ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో నేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు..

తెలంగాణలో ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో నేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు..

  • Published Nov 09, 2023 | 9:24 AMUpdated Nov 09, 2023 | 9:24 AM
పొంగులేటి శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు.. తెల్లవారుజాము నుంచి

తెలంగాణలో ఎన్నికల వేళ ఐటీ, ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఇళ్లల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి నివాసం, కార్యాలయాలపై గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఈ దాడులను తాము ముందే ఊహించామని ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. అలానే బుధవారం నాడు పొంగులేటి మాట్లాడుతూ.. తనపై ఐటీ దాడులు జరగవచ్చన్నారు. ఆయన చెప్పినట్లుగానే నేడు తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

గురువారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఖమ్మంలో ఉన్న పొంగులేటి ఇల్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దాడుల నేపథ్యంలో.. ఐటీ అధికారులు 8వాహనాల్లో తరలి వచ్చారు. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే.. నేడు పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి కుటుంబ సభ్యులందరూ ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజాము 4:30 గంటలకు పొంగులేటి ఇంటికి వచ్చిన అధికారులు.. ఆయన కుటుంబసభ్యులు, అనుచరుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న పొంగులేటి నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇక రాజకీయాల విషయానికి వస్తే.. పొంగులేటి కొంతకాలం క్రితం అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఐటీ దాడులకు సంబంధించి పొంగులేటి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని.. తన ఇంటిపై కూడా దాడులు జరగవచ్చని చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లుగానే గురువారం తెల్లవారుజామున పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరగడం గమనార్హం.

ఈదాడులపై పొంగులేటి అనుచరలు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుట్రలోనే భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. అంతేకాక ఈరోజు నామినేషన్ వేస్తున్న సమయంలో దాడులు చేయడం వెనక కుట్ర ఉందంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని ప్రయాత్నాలు చేసినా.. పొంగులేటి భయపడరని.. ఈరోజు ఆయన నామినేషన్‌ దాఖలు చేస్తారని చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి